టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ “30 ఇయర్స్ ఇండస్ట్రీ” డైలాగ్‌తో పాపులర్ అయిన పృథ్వీరాజ్ (“30 Years Industry” Prudhviraj) ఆసుపత్రి పాలయ్యాడు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన “లైలా” (Lila Movie ) సినిమా ఫంక్షన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపాయి. ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.
గతంలో వైసీపీ(YCP)కి మద్దతు తెలిపిన పృథ్వీరాజ్‌కి సీఎం జగన్ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఆయన ఆ పదవి నుంచి తొలగించబడ్డారు. ఆ తర్వాత వైసీపీ నుంచి పూర్తిగా దూరమై, ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. కూటమి తరఫున ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొని కూటమి విజయంలో భాగమయ్యాడు. ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బిజీ అయినా పృద్వి..తాజాగా విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ లో నటించాడు. ఇటీవల “లైలా” సినిమా వేడుకలో పృథ్వీరాజ్ వైసీపీపై పరోక్షంగా సెటైర్లు వేయడం తో ఇప్పుడు సినిమా వివాదంలో చిక్కుకుంది.