Site icon HashtagU Telugu

Bollywood : యాక్టర్ అఖిల్ మృతి..శోకసంద్రంలో ఇండస్ట్రీ

Akhil Mishra Dies

Akhil Mishra Dies

చిత్రసీమ (Bollywood)లో మరో విషాదం చోటుచేసుకుంది. 3 ఇడియట్స్ (3 Idiots) ఫేమ్ , నటుడు అఖిల్ మిశ్రా (Akhil Mishra ) (67) కన్నుమూశారు. 3 ఇడియట్స్ చిత్రంతో పాపులార్టీ తెచ్చుకున్న మిశ్రా..ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ (Hyderabad) లో జరుగుతుంది. గురువారం చిత్ర సెట్ లో జరిగిన ప్రమాదంలో ఈయన మృతి చెందినట్లు సమాచారం. ఓ భారీ బిల్డింగ్ ఫై షూటింగ్ జరుగుతుండగా.. ప్ర‌మాద‌వ‌శాత్తూ బిల్డింగ్‌పై నుంచి అఖిల్ మిశ్రా కింద‌ప‌డిన‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమా తాలూకా వివరాలు, ప్రమాదం తాలూకా మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

3 ఇడియ‌న్స్ మూవీ లో లైబ్రేరియ‌న్ పాత్ర‌లో అఖిల్ మిశ్రా న‌టించాడు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో డాన్‌, గాంధీ మై ఫాద‌ర్‌, శిఖ‌ర్‌తో పాటు ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ నటించి మెప్పించారు. అలాగే సీఐడీ, ఉత్త‌ర‌న్‌, ఉడాన్‌తో స‌హా పలు టీవీ సీరియ‌ల్స్‌లలో కూడా అఖిల్ మిశ్రా కీల‌క పాత్ర‌లు పోషించాడు జ‌ర్మ‌న్ న‌టి సుజానే బెర్నార్ట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అఖిల్ మిశ్రా.. రెండు సార్లు ఈ జంట పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. 2009లో రిజిస్ట‌ర్ మ్యారేజీ చేసుకున్న వీరు 2011లో సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల్లో మ‌రోసారి పెళ్లి పీట‌లెక్కారు. అఖిల్ మిశ్రా మ‌ర‌ణంతో బాలీవుడ్‌లో విషాదం ఛాయ‌లు అల్లుకున్నాయి.

Read Also : Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తోంది.. వీటిపై భారీగా తగ్గింపులు..!