3 Body Problem : ఆ వెబ్ సిరీస్ తడాఖా.. రెండు నవలల సేల్స్‌కు రెక్కలు

3 Body Problem : ‘3 బాడీ ప్రాబ్లమ్’ అనే వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై  దుమ్ము రేపుతోంది. 

  • Written By:
  • Updated On - March 27, 2024 / 04:07 PM IST

3 Body Problem : ‘3 బాడీ ప్రాబ్లమ్’ అనే వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై  దుమ్ము రేపుతోంది.  ఈ వెబ్ సిరీస్ ఎఫెక్టుతో అమెజాన్‌లో రెండు నవలల సేల్స్ భారీగా పెరిగిపోయాయి. దీంతో అసలు ఈ వెబ్ సిరీస్ చూడనివారు కూడా ఇదంతా దేని గురించి అని గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ‘రిమెంబ్రెన్స్ ఆఫ్ ఎర్త్స్ పాస్ట్’ అనే పుస్తకం ఆధారంగా ‘3 బాడీ ప్రాబ్లమ్’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. దీంతో ఈ పుస్తకం సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. ‘3 బాడీ ప్రాబ్లమ్’ (3 Body Problem) సిరీస్‌లో ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకం గురించి కూడా పదేపదే ప్రస్తావన వచ్చింది. దీంతో దాని సేల్స్ సైతం ఆకాశాన్ని అంటాయి.

We’re now on WhatsApp. Click to Join

‘3 బాడీ ప్రాబ్లమ్’ వెబ్ సిరీస్‌ను చాలా తెలివిగా తెరకెక్కించారని తొలుత చాలామంది అభిప్రాయపడ్డారు. కాన్సెప్ట్ బాగున్నా.. కొంచెం అతిగా ఉందని పలువురు అప్పట్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘3 బాడీ ప్రాబ్లమ్’ అనే సిరీస్ ఇలా ఉంటే.. అందులో చెబుతున్న పుస్తకం  ‘రిమెంబ్రెన్స్ ఆఫ్ ఎర్త్స్ పాస్ట్’ ఎలా ఉంటుందో చూద్దామనే ఆలోచనతో చాలామంది ప్రేక్షకులు అమెజాన్‌లో ఈ పుస్తకాన్ని కొనడానికి ముందుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఇది అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌ బుక్‌గా మారిపోయింది. ‘3 బాడీ ప్రాబ్లెమ్’లో కీలక పాత్ర అయిన ‘యే వెంజీ’ అనే మహిళ.. ఎప్పుడూ ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకాన్ని చదివి విశ్వం యొక్క ప్రయోజనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అందుకే అమెజాన్‌లో ఈ బుక్ సేల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి.

Also Read :Sania Mirza – MP Candidate : కాంగ్రెస్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా ?

అసలు కథ ఇదీ..

  • ‘రిమెంబ్రెన్స్ ఆఫ్ ఎర్త్స్ పాస్ట్’ అనే పుస్తకాన్ని చైనీస్ రచయిత లియు సిక్సిన్ రచించారు.
  • ఈ  బుక్‌ వేదికగా విశ్వంలోని ఎన్నో విషయాలను ఆయన ప్రశ్నించారు.
  • ఈ పుస్తకాన్నే వెబ్ సిరీస్‌గా మార్చారు.
  • ‘3 బాడీ ప్రాబ్లమ్’ సిరీస్‌లో ట్రైసోలారిస్ అనే గ్రహాన్ని గ్రహంతరవాసులు ఆక్రమించుకుంటారు. ఆ సమయంలో అక్కడి మనుషులు ఏం చేశారనే అంశంపై సిరీస్ సాగుతుంది.
  • ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ డేవిడ్ బెనియోఫ్, డీబీ వెయిస్, అలెక్సాండర్ వూ కలిసి ‘3 బాడీ ప్రాబ్లమ్’ను తెరకెక్కించారు.
  • గ్రహంతరవాసులు వచ్చి ఆ గ్రహాన్ని ఆక్రమించుకున్న తర్వాత శాస్త్రవేత్తలు ఏం చేశారనే విషయాన్ని ఈ సిరీస్‌లో చక్కగా ప్రజెంట్ చేశారు.

Also Read :INDIA bloc : ఇండియా కూటమిలో చీలిక.. ఆ పార్టీ ఔట్