ఊర్మిళా మటోండ్కర్ – మొహ్సిన్ అక్తర్
వీరిద్దరికి 2016లో మ్యారేజ్ అయింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఈ దంపతులు డైవర్స్(Celebrity Divorces 2024) తీసుకున్నారు. ఆర్థిక వ్యవహారాల విషయంలో ఊర్మిళ, మొహ్సిన్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈక్రమంలో తనకు భర్త నుంచి విడాకులు కావాలని ఊర్మిల పిటిషన్ వేశారు. దీంతో విడాకులు మంజూరయ్యాయి.
ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్
వీరిద్దరికి 2004 సంవత్సరం నవంబరులో పెళ్లి జరిగింది. వీరి ఇద్దరు కుమారుల పేర్లు.. యాత్ర, లింగ. ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్లు 2022లో ప్రకటించారు. 2024 నవంబరు 27న వీరిద్దరికి లీగల్‌గా డైవర్స్ మంజూరయ్యాయి. వ్యక్తిగత అభిప్రాయ బేధాలతో వీరు విడిపోయారు.
ఏఆర్ రెహమాన్ – సైరా బాను
వీరిద్దరికి 1995లో పెళ్లయింది. 18 ఏళ్లు దాటిన పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఏఆర్ రెహమాన్, సైరా భాను దంపతులు విడిపోయారు. వ్యక్తిగత అభిప్రాయ బేధాల వల్లే విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఏ విషయంలో ఈ దంపతుల మధ్య గ్యాప్ వచ్చిందనే నిర్దిష్ట కారణం తెలియరాలేదు.
ఇషా డియోల్ – భరత్ తఖ్తానీ
ఇషా డియోల్.. ధర్మేంద్ర – హేమ మాలిని దంపతుల కుమార్తె. ఆమె 2012లో భరత్ తక్తానిని పెళ్లి చేసుకుంది. ఈ జంట 2024 జనవరి ప్రారంభంలో విడాకులు తీసుకుంది. వీరికి రాధ్య, మిరయా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
జయం రవి – ఆర్తి
వీరిద్దరు 2009లో మ్యారేజ్ చేసుకున్నారు. 2024 సెప్టెంబరులో జయం రవి, ఆర్తి విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
జీవీ ప్రకాశ్ కుమార్ – సైంధవి
వీరిద్దరికి 2013లో పెళ్లయింది. జీవీ ప్రకాశ్ కుమార్, సైంధవి దంపతులు 2024 మే నెలలో విడాకులు తీసుకున్నారు. వాస్తవానికి వీరిద్దరు చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. హైస్కూల్ లో ఉన్నప్పుడే లవ్ చేసుకున్నారు. 2020లో వీరికి పాప జన్మించింది. ఏమైందో ఏమో ఈ ఏడాదే విడాకులు తీసుకున్నారు.
యువ రాజ్‌కుమార్ – శ్రీదేవి బైరప్ప
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ చాలా ఫేమస్. ఆయన మనవడు, నటుడు యువ రాజ్‌కుమార్‌కు 2019లో శ్రీదేవి బైరప్పతో పెళ్లి జరిగింది. తన భార్య టార్చర్ పెడుతోందని ఆరోపిస్తూ ఆయన విడాకుల కోసం 2024 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ‘కాంతార’ హీరోయిన్ సప్తమి గౌడతో యువ రాజ్‌కుమార్‌కు అఫైర్ నడుస్తోందని శ్రీదేవి బైరప్ప ఆరోపించింది. ఈ కామెంట్ చేసినందుకు శ్రీదేవిపై సప్తమి రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసింది.