Site icon HashtagU Telugu

Heeramandi.. The Diamond Bazaar : 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్

2024 Most Popular Indian Web Series Hiramandi: The Diamond Bazaar

2024 Most Popular Indian Web Series Hiramandi: The Diamond Bazaar

IMDB :  2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన 10 వెబ్ సిరీస్‌లను IMDB ప్రకటించింది. ఈ వెబ్‌ సిరీస్‌లో నెం.1 ర్యాంకింగ్ వెబ్ సిరీస్‌గా హీరామండి:ది డైమండ్ నిలిచింది. ఈ సందర్భంగా బజార్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్ష్ ఇండియా సిరీస్ హెడ్ తాన్యా బామి మాట్లాడుతూ.. “నెట్ ఫ్లిక్ష్ ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సిరీస్ లకు ప్రసిద్ది చెందింది. మా ఇండియన్ సిరీస్ ఆ గుర్తింపును పొందడం నిజంగా సంతోషాన్ని కలిగిస్తుంది. హీరమండి: డైమండ్ బజార్ అనే మా అత్యంత ప్రతిష్టాత్మక డ్రామా సిరీస్ ఒక సాంస్కృతిక చర్చగా మారింది. మామ్లా లీగల్ హై (6వ ర్యాంక్) కోర్టు రూమ్ డ్రామాను రిఫ్రెషింగ్ హ్యూమర్ తో నైపుణ్యంగా మిళితం చేసి, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (10వ ర్యాంక్) వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ ను నిర్వచించింది. IMDB టాప్ 10-మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ ఆఫ్ 2024 జాబితాలో ఈ మూడు ప్రత్యేకమైన సిరీస్ లను చేర్చడం మన భారతీయ వైవిధ్యత మరియు నాణ్యతను ప్రదర్శిస్తుంది. మా కంటెంట్ వ్యూహంలో లాంగ్-ఫార్మాట్ స్టోరీ టెల్లింగ్ ప్రాముఖ్యతను బలపరుస్తుంది. 2025 కోసం మరింత కొత్త ఉత్సాహంతో ఎదురుచూస్తున్నామని, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరెన్నో మరపురాని కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ప్రైమ్ వీడియో, ఇండియా ఎస్వీఓడీ డైరెక్టర్ & హెడ్ షిలాంగి ముఖర్జీ మాట్లాడుతూ..”2024 మాకు అద్భుతమైన సంవత్సరం, ఎందుకంటే మేము కొత్త సిరీస్ లను ప్రారంభించడమే కాకుండా, మా సూపర్ సక్సెస్ ఫ్రాంచైజీల కొత్త సీజన్స్ తిరిగి తీసుకువచ్చాము. ఐఎండిబి 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ లను, జాబితాలో మా మూడు సిరీస్ లు టాప్ 5లో ఉండటం ఆ ప్రేక్షకుల ప్రేమకు నిదర్శనం. మా రిటర్నింగ్ ఫేవరెట్లు మీర్జాపూర్ (నెం.2 ర్యాంక్) మరియు పంచాయత్ (నెం.3 ర్యాంక్), అలాగే సిటాడెల్: హనీ బన్నీ (ర్యాంక్ నెం.5) సిటాడెల్ ప్రపంచం నుండి పుట్టిన భారతీయ సిరీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు మరియు IMDB వినియోగదారుల నుండి మాకు లభించిన ప్రేమకు మేము రుణపడి ఉన్నాము. మేము 2025లో భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని అద్భుతమైన సిరీస్ మరియు సినిమాల రాబోయే కంటెంట్ లైనప్ గురించి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము.

2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ టాప్ 10

1. హీరమండి: డైమండ్ బజార్
2. మీర్జాపూర్
3. పంచాయత్
4. గ్యారాహ్ గ్యారాహ్
5. సిటాడెల్: హనీ బన్నీ
6. మామ్లా లీగల్ హై
7. తాజా ఖబర్
8. మర్డర్ ఇన్ మహిమ్
9. శేఖర్ హోమ్
10. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో

జనవరి 1 మరియు నవంబర్ 25, 2024 మధ్య భారతదేశంలో విడుదలైన అన్ని వెబ్ సిరీస్‌లో, సగటు 5 లేదా అంతకంటే ఎక్కువ IMDB యూజర్ రేటింగ్ కలిగి ఉన్నాయి. ఈ 10 టైటిల్స్ ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ద్వారా నిర్ణయించబడ్డాయి. IMDB వినియోగదారులు వీటిని మరియు ఇతర శీర్షికలను స్ట్రీమింగ్ సేవలో విడుదల చేసినప్పుడు తెలియజేయడానికి imdb.com/watchlist వద్ద వారి IMDB వాచ్ లిస్ట్ కు జోడించవచ్చు. ఈ వెబ్ సిరీస్ జాబితాలో ఐదు సబ్ స్క్రిప్షన్ ఆధారిత ఓటిటి నుండి వున్నాయి. నెట్ ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియో నుండి చెరో మూడు శీర్షికలు, జియోసినిమా నుండి రెండు మరియు డిస్నీ + హాట్ స్టార్ మరియు జీ5 నుండి ఒక్కొక్కటి ఉన్నాయి. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో IMDB వార్షిక జాబితాలో స్థానం పొందిన మొదటి నాన్-ఫిక్షన్ సిరీస్.

Read Also: Year Ender 2024 : 2024లో భారతీయులు ఈ విషయాల గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు..!