Site icon HashtagU Telugu

Pooja Hegde Upset: ప్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ క్వీన్.. 2022లో హిట్ కొట్టేనా!

Pooja

Pooja

2018-20లో నాన్‌స్టాప్ హిట్‌లతో టాలీవుడ్, బాలీవుడ్‌ పై తనదైన ముద్ర వేసింది. కానీ అల వైకుంఠపురములో బంపర్ సక్సెస్ తర్వాత, డస్కీ బ్యూటీ పలు సినిమాల్లో నటించింది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు నిరాశను మిగిలిచాయి. దీంతో పూజ హిట్స్ కు బ్రేక్ పడినట్టయింది. టాలీవుడ్‌లో పూజా హెగ్డే తదుపరి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబుతో నటించబోతోంది. అయితే మహేష్ బాబు తల్లి హఠాన్మరణంతో సినిమా షూటింగ్ ను వాయిదా వేశాడు. బాధను అధిగమించేందుకు మహేష్ స్పెయిన్‌కు సోలో ట్రిప్‌కు వెళ్లాడు. ఈ చిత్రాన్ని పోకిరి తేదీ ఏప్రిల్ 28న విడుదల చేయాలని భావించారు.

కానీ నేటి పరిస్థితుల ప్రకారం, ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి సల్మాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ డిసెంబర్ 2022లో విడుదల కావాల్సి ఉండగా, కానీ ఆ చిత్రం కూడా ఈద్ 2023కి వాయిదా పడింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి సర్కస్ సినిమా కూడా షాక్ ఇచ్చింది. 2022లో సర్కస్ మూవీ కొంత మైలేజ్ ఇస్తుందని భావించిన బుట్టబొమ్మకు నిరాశను మిగిల్చింది.

Exit mobile version