2018 Movie : ఇండియా నుంచి అధికారిక ఆస్కార్ ఎంట్రీ సాధించిన మలయాళీ సూపర్ హిట్ సినిమా..

తాజాగా ఆస్కార్ 2024కి ఈ సంవత్సరం మన దేశం నుంచి మలయాళీ సూపర్ హిట్ సినిమా అయిన '2018'ని పంపిస్తున్నట్టు ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 09:09 PM IST

ప్రతి సంవత్సరం సినీ అత్యున్నత పురస్కారమైన ఆస్కార్(Oscar Awards) అవార్డులకు వెళ్లాలని ప్రపంచంలోని అన్ని సినీ పరిశ్రమలు కలలు కంటాయి. భారతదేశానికి ఆస్కార్ అంటే కష్టం అనుకున్న వాళ్లందరికీ, దేశం నుంచి అధికారిక ఎంట్రీ పంపకపోయినా డైరెక్ట్ గా ట్రై చేసి ఆస్కార్ కొట్టొచ్చని రాజమౌళి(Rajamouli) నిరూపించారు. RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ గత సంవత్సరం ఆస్కార్ బెస్ట్ సాంగ్ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మన దేశంలోని చాలా సినిమాలు ఆస్కార్ కలలు కంటున్నాయి ఇప్పుడు.

గత సంవత్సరం ఆస్కార్ 2023కి గుజరాతి సినిమా లాస్ట్ ఫిలిం షోని పంపించారు. తాజాగా ఆస్కార్ 2024కి ఈ సంవత్సరం మన దేశం నుంచి మలయాళీ సూపర్ హిట్ సినిమా అయిన ‘2018’ని పంపిస్తున్నట్టు ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా ప్రకటించింది.

ఆంటోని జోసెఫ్ దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో టోవినో థామస్, తన్వి రామ్, అపర్ణ బాలమురళి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘2018-ఎవరీ వన్ ఈజ్ హీరో’ సినిమా మేలో మొదట మలయాళంలో రిలీజయి భారీ విజయం సాధించింది. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి మలయాళంలో పెద్ద హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

కేరళలో 2018 లో వచ్చిన వరదల నేపథ్యంలో.. వరదలు వచ్చినప్పుడు మనుషులు ఒకరికి ఒకరు ఎలా సహాయం చేసుకున్నారు అనే కథాంశంతో తెరకెక్కించారు. ఇప్పటికే పలు అవార్డులు సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ కి వెళ్తుంది. మరి 2018 సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తుందా, ఆస్కార్ సాధిస్తుందా చూడాలి.