Site icon HashtagU Telugu

Bigg Boss 18 : నెలకు 60 కోట్లు.. బిగ్ బాస్ కోసం స్టార్ హీరో మైండ్ బ్లాక్ రెమ్యునరేషన్..!

Salman Khan

Salman Khan

Bigg Boss 18 భాషతో సంబంధం లేకుండా నేషనల్ లెవెల్ లో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో 8వ సీజన్ నడుస్తున్న బిగ్ బాస్ హిందీ వెర్షన్ ఈ ఆదివారం నుంచి 18వ సీజన్ మొదలైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 18 అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ సీజన్ లో మహేష్ మరదలు శిల్ప శిరోద్కర్ కూడా హౌస్ లోకి కంటెస్టెంట్ గా వచ్చింది.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ (BiggBoss) సీజన్ 18 కోసం సల్మాన్ ఖాన్ భారీ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు, తమిళ, కనడ, మలయాళం తో పోల్చితే బిగ్ బాస్ హిందీకి భారీ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఆ షోని హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్ కోసం కూడా భారీ రెమ్యునరేషన్ అందిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ 200 నుంచి 250 కోట్ల దాకా రెమ్యునరేషన్..

ఈ క్రమంలో సీజన్ 18 కోసం ఏకంగా నెలకు 60 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. అంటే 3 నెలల బిగ్ బాస్ కోసం 200 కోట్ల దాకా సల్మాన్ ఖాన్ (Salman Khan) రెమ్యునరేషన్ ఉంటుందని చెబుతున్నారు. బిగ్ బాస్ కోసం సల్మాన్ ఖాన్ 200 నుంచి 250 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ముంబై మీడియా హడావిడి చేస్తుంది.

బిగ్ బాస్ రీజనల్ లాంగ్వేజెస్ లో హోస్ట్ గా చేస్తున్నందుకు 30 కోట్లు మాత్రమే హైయెస్ట్ రెమ్యునరేషన్ గా అందిస్తున్నారు. కానీ సల్మాన్ ఖాన్ కి మాత్రం ఆ లెక్క వేరే లెవెల్ లో ఉంది. ఏది ఏమైనా బిగ్ బాస్ హిందీ అంటే సల్మాన్ ఖాన్, సల్మాన్ అంటే బిగ్ బాస్ అనిపించుకునేలా చేసుకున్నాడు. అటు సినిమాలతో పాటు బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ ఖాన్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నారు.

Also Read : Pawan Kalyan : కుమార్తెతో కలిసి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పవన్‌ కల్యాణ్‌

Exit mobile version