Salman Khan : సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబాటు.. ఇద్దరి అరెస్ట్

Salman Khan : బాలీవుడ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌ వద్ద కలకలం చోటుచేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Salman Khan

Salman Khan

Salman Khan : బాలీవుడ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌ వద్ద కలకలం చోటుచేసుకుంది. ముంబై సమీపంలోని పన్వేల్‌లో ఉన్న ఆ ఫామ్‌హౌస్‌‌లోకి చొరబడేందుకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అజేష్‌ కుమార్‌ ఓంప్రకాష్‌ గిల్‌, గురుసేవక్‌ సింగ్‌ తేజ్‌సింగ్‌ సిఖ్‌లు సల్మాన్ ఖాన్‌కు చెందిన అర్పితా ఫామ్‌హౌస్‌ వద్దకు వెళ్లారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డులకు తమను సల్మాన్‌ ఖాన్‌ అభిమానులుగా పరిచయం చేసుకున్నారు. తాము సల్మాన్‌ను కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈక్రమంలో తమ ఒరిజినల్ పేర్లను కాకుండా.. వేరే పేర్లను సెక్యూరిటీ గార్డులకు చెప్పుకున్నారు. అయితే ఫామ్ ‌హౌస్(Salman Khan) లోపలికి వెళ్లేందుకు సెక్యూరిటీ గార్డులు నో చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో అజేష్‌ కుమార్‌ ఓంప్రకాష్‌ గిల్‌, గురుసేవక్‌ సింగ్‌ తేజ్‌సింగ్‌ సిఖ్‌లు కాసేపటి తర్వాత  ఫామ్ హౌస్ గోడల ఎదుట ఉన్న పొదల పైనుంచి దూకి.. గోడపై అమర్చిన ముళ్ల తీగలను కత్తిరించి లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. దీన్ని గుర్తించిన సెక్యూరిటీ గార్డులు వాళ్లను పట్టుకున్నారు. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించగా..  హుటాహుటిన అక్కడికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులను చూపించి సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డులను ఏమార్చి.. లోపలికి ఎంటరయ్యేందుకు ఇద్దరు నిందితులు యత్నించారని దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఫామ్ హౌస్ లోపలికి వెళ్లి ఏం చేయాలనుకున్నారు అనేది ఇంకా తెలియరాలేదు. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలన్నీ వెలుగుచూసే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన జనవరి 4వ తేదీన చోటుచేసుకుంది.

Also Read: Plane Door Horror : 16వేల అడుగుల ఎత్తు నుంచి ఐఫోన్ పడిపోయి ఏమైందంటే ?

సల్మాన్ నటించబోయే సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి సమంత ఓకే చెప్పిందనే వార్త ఒకటి వైరల్ అవుతుంది. మొన్నటివరకు త్రిష హీరోయిన్ గా నటిస్తుందనుకున్న ఒక సినిమాలో..  త్రిషని పక్కన పెట్టేసి సమంతను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారనేది ఆ వైరల్ వార్త సారాంశం.విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా చేయబోయే “ది బుల్” సినిమాలో సమంత హీరోయిన్‌గా చేస్తారనేది లేటెస్ట్ అప్డేట్. పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా ఉఊ అంటావా అనే ఐటమ్‌ సాంగ్‌లో సమంత నటన బాలీవుడ్‌ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో సల్మాన్‌ఖాన్‌కు జంటగా ఈ బ్యూటీని నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని సమంత అఫీషియల్ గా చెబితే వినాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సమంత ఫ్యాన్స్.

  Last Updated: 08 Jan 2024, 03:28 PM IST