మాస్ మహారాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ హీరోయిన్ గా నటించింది. గురువారం రిలీజైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఐతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా ఓల్డ్ హిందీ సాంగ్స్ వినిపిస్తాయి. తెలుగు మాస్ ఆడియన్స్ ఆ సాంగ్స్ విని బోర్ ఫీలయ్యారు. అందుకే సినిమా మీద ఇంపాక్ట్ పడుతుందని గుర్తించిన మేకర్స్ మిస్టర్ బచ్చన్ లో 13 నిమిషాలు ట్రిం చేశారు.
కొన్ని హిందీ సాంగ్స్ తో పాటుగా అభ్యంతరకరమైన సీన్స్ విషయంలో కూడా కత్తెర వాడినట్టు తెలుస్తుంది. మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) సినిమా విషయంలో మాస్ రాజా ఫ్యాన్స్ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఐతే సినిమా టాక్ ఎలా ఉన్నా రవితేజ (Raviteja) వింటేజ్ మాస్ ఎనర్జీ, భాగ్య శ్రీ అందాలు మాత్రం కొంతమంది ఆడియన్స్ కి సూపర్ కిక్ అందిస్తున్నాయి.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా వచ్చిన మిస్టర్ బచ్చన్ కథనం పూర్తిగా మార్చేశాడు హరీష్ శంకర్. ఐతే సీరియస్ సినిమాను కామెడీగా అది కూడా రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్ గా చేసినందుకు హరీష్ శంకర్ మీద రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ ఆకట్టుకున్నా సినిమాను గట్టేక్కించలేదు.
ఐతే ఈ లెంగ్త్ ట్రిం చేశారు కాబట్టి కొత్తగా సినిమా చూసే ఆడియన్స్ కు తప్పకుండా నచ్చే ఛాన్స్ ఉంటుంది. రవితేజ హరీష్ శంకర్ మిరపకాయ్ తో హిట్ కొట్టగా మళ్లీ ఇన్నాళ్లకు కలిసి మిస్టర్ బచ్చన్ తీశారు.
Also Read : Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్.. నల్లబ్యాడ్జీలతో నిరసనలు