Kurchi Madatapetti Song : గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి 100 మిలియన్ రికార్డ్..!

Kurchi Madatapetti Song సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను హారిక హాసిని

Published By: HashtagU Telugu Desk
100 Million Views Record For Mahesh Guntur Karam Kurchi Madatapetti Song

100 Million Views Record For Mahesh Guntur Karam Kurchi Madatapetti Song

Kurchi Madatapetti Song సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మించారు. ఈ సినిమా రిలీజైన టైం లో టాక్ బాగా లేకపోయినా మౌత్ టాక్ తో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమాలో చెప్పుకోదగ్గ మరో విషయం ఏంటంటే ఈ మూవెలో మహేష్ డాన్స్ లు అదరగొట్టేశాడు.

ఇదివరకు తన డాన్స్ ల మీద పెద్దగా ఫోకస్ చేయని మహేష్ గుంటూరు కారంలో మహేష్ కూడా ఈ రేంజ్ లో డాన్స్ వేస్తాడా అని షాక్ అయ్యేలా చేశాడు. మహేష్ డాన్స్ కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా సూపర్ ట్రీట్ అందించింది. సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే దుమ్ము దులిపేసింది. సినిమాలోనే కాదు ఆ సాంగ్ వీడియో సాంగ్ యూట్యూబ్ ని కూడా షేక్ చేస్తుంది.

లేటెస్ట్ గా కుర్చీ మడతపెట్టి సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ తో మరో రికార్డ్ సృష్టించింది. మహేష్ సాంగ్ ఈ రేంజ్ లో 100 మిలియన్స్ అది కూడా ఇంత తక్కువ టైం లో రీచ్ అవ్వడం క్రేజీ అని చెప్పొచ్చు. థమన్ మ్యూజిక్ అందించిన కుర్చీ మడతపెట్టి సాంగ్ లో శ్రీ లీల డాన్స్ కూడా అదరగొట్టేసింది.

మహేష్ బాబు సినిమాల్లో డాన్స్ లు ఉండవు అనుకునే వారందరికీ ఇక నుంచి మహేష్ కూడా డాన్స్ లు ఇరగదీస్తాడు అనిపించేలా చేశాడు. గుంటూరు కారం మహేష్ మేనియా కొనసాగించేలా చేసింది.

Also Read : Rajamouli Mahesh Movie : రాజమౌళి మహేష్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఇన్వెస్ట్మెంట్..?

  Last Updated: 17 Feb 2024, 07:46 AM IST