సినీ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh)కు ఒంగోలు కోర్టు (Ongole Court) బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఏడాది జైలు (One Year in Jail )తో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. చిత్రసీమలో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న గణేష్..గత కొంతకాలంగా సినిమాలను నిర్మించడం మానేసి , తన వ్యాపారాలతో బిజీ గా ఉన్నారు. ఈ మధ్యనే మళ్లీ రాజకీయాల వైపు అడుగులేయడం మొదలుపెట్టారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ టికెట్ కు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈయనకు టికెట్ వస్తుందని అంత భావిస్తున్నారు. ఈ క్రమంలో ఒంగోలు కోర్ట్ షాక్ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
బండ్ల గణేష్‌కు ఒంగోలుకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లకు ఆర్థిక సంబందమైన వివాదం కొనసాగుతున్నది. వారి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించారు. అయితే ఆ వివాదానికి పరిష్కారం లభించకపోవడంతో 95 లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయిందంటూ వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. గత కొద్దికాలంగా ఈ కేసు ఒంగోలు కోర్టులో కొనసాగుతున్నది. తాజాగా కోర్టు తీర్పు కోసం బండ్ల గణేష్ ఒంగోలు న్యాయస్థానంలో హాజరయ్యారు. ఈ సిందర్భంగా రెండు వర్గాల వాదనలు పూర్తయిన తర్వాత బండ్ల గణేష్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే 30 రోజుల్లో 95 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు తీర్పులో పేర్కొన్నది. దాంతో బండ్ల గణేష్‌కు షాక్ తగిలినట్టయింది. కోర్టు తీర్పుపై 30 రోజుల్లో ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని ఒంగోలు న్యాయస్థానం తెలిపింది.
Read Also : CM Revanth Reddy : కేసీఆర్ ను చచ్చిన పాముతో పోల్చిన రేవంత్