Bhakta Kannappa : అప్పటి కన్నప్ప అలా.. ఇప్పటి కన్నప్ప ఇలా..

మంచు విష్ణు నటిస్తున్న చిత్రం 'కన్నప్ప' అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ కథని రీమేక్ చేయడమే కాదు, మేకింగ్ ని కూడా రీమేక్ చేసేస్తున్నారు విష్ణు.

Published By: HashtagU Telugu Desk
Manchu Vishnu Kannappa Movie and Krishnam Raju Bhakta Kannappa Movie Comparisons

Manchu Vishnu Kannappa Movie and Krishnam Raju Bhakta Kannappa Movie Comparisons

కృష్ణంరాజు (Krishnam Raju) కెరీర్‌లోనే కాదు తెలుగు పరిశ్రమలో కూడా ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన సినిమా ‘భక్తకన్నప్ప’(Bhakta Kannappa). బాపు-రమణలు తెరకెక్కించిన ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయడానికి టాలీవుడ్ లో చాలా ప్రయత్నాలే జరిగాయి. కృష్ణంరాజు కూడా ఈ చిత్రాన్ని ప్రభాస్ హీరోగా రీమేక్ చేయాలని ఆశపడ్డారు. ఆ తరువాత చాలా మంది హీరోల పేర్లు ఈ రీమేక్ కోసం వినిపించాయి. కానీ ఫైనల్ గా మంచు విష్ణు(Manchu Vishnu) అదే కథతో సినిమాని తెరకెక్కిస్తున్నారు.

మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ కథని రీమేక్ చేయడమే కాదు, మేకింగ్ ని కూడా రీమేక్ చేసేస్తున్నారు విష్ణు. కేవలం లొకేషన్‌లు, నటులు మాత్రమే మార్చి.. అప్పటి కన్నప్ప మేకింగ్ స్టైల్ నే ఫాలో అయ్యిపోతున్నారు. కృష్ణంరాజు కన్నప్ప సినిమా షూటింగ్ 70 రోజుల పాటు ఏకదాటిగా జరిగింది. సుమారు 500కు పైగా యూనిట్ సభ్యులతో ఈ షూటింగ్ జరిగింది. మూవీలోని ఒక కైలాసం సన్నివేశం తప్ప మిగిలిన సీన్స్, సాంగ్స్ అన్ని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడేనికి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న పట్టిసీమ, బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు.

ఇక మంచు విష్ణు కన్నప్ప విషయానికి వస్తే.. ఈ సినిమాని కూడా ఏకదాటిగా చిత్రీకరించి సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తామంటూ విష్ణు తెలియజేశారు. ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లోని అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతుంది. చెప్పినట్లే సింగల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసేందుకు.. సినిమాకి కావాల్సిన సెట్ ప్రోపర్టీ మొత్తం ఇక్కడే రెడీ చేయించుకొని ఎనిమిది భారీ కంటైనర్లలో న్యూజిలాండ్ కి తరలించారు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 800 మంది పనిచేస్తున్నారట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అక్కడ శరవేగంగా జరుగుతుంది.

ఇక మంచు విష్ణు కన్నప్ప సినిమాలో పరిశ్రమకు ఒకరు చొప్పున స్టార్స్ అంతా నటిస్తున్నారు. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శరత్ కుమార్, శివ రాజ్ కుమార్.. ఇలా చాలా మంది నటిస్తున్నారు. మరి అప్పటి కన్నప్ప మెప్పించినట్టు మాన్చు విష్ణు కన్నప్ప ఇప్పటి ప్రేక్షకులని మెప్పిస్తుందా చూడాలి.

 

Also Read : Alia Bhatt : ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై స్పందించిన అలియా భట్..

  Last Updated: 18 Nov 2023, 07:21 AM IST