Food Deliveries : జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్ ఇచ్చే విషయం ఇది. ఈ ప్రఖ్యాత ఫుడ్ డెలివరీ యాప్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. మరోసారి తమ ప్లాట్ ఫాం ఫీజులను(Platform Fee) ఇవి పెంచేశాయి. జొమాటో, స్విగ్గీలు ఇప్పటిదాకా ప్లాట్ ఫాం ఫీజుగా రూ.5 యూజర్ల నుంచి వసూలు చేసేవి. ఇప్పుడు దాన్ని రూ.6కు పెంచేశాయి. అంటే దాదాపు 20 శాతం మేర ప్లాట్ ఫాం ఫీజు పెరిగిందన్న మాట.
We’re now on WhatsApp. Click to Join
జొమాటో, స్విగ్గీ ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ప్లాట్ ఫాం ఫీజుగా రూ.6 వసూలు చేస్తున్నాయి. డెలివరీ ఫీజు, జీఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీలకు అదనంగా ప్లాట్ ఫాం ఫీజు(Food Deliveries) ఉంటుంది. త్వరలోనే దేశంలోని అన్ని నగరాల్లో కూడా పెరిగిన ప్లాట్ ఫాం ఫీజును అమల్లోకి తేనున్నారు.
Also Read :IAS Puja Khedkar : పరారీలో ట్రైనీ ఐఏఎస్ పూజ పేరెంట్స్.. ఎందుకు ?
జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్ ఫీజులను 2023 సంవత్సరంలోనూ ఈ రెండు కంపెనీలు పెంచాయి. తొలినాళ్లలో ప్లాట్ ఫామ్ ఫీజు రూ.2 ఉండేది. క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జొమాటో కంపెనీ ప్లాట్ ఫామ్ ఫీజును 25 శాతం మేర పెంచేసి రూ.5కు చేర్చింది. ఇక వేగవంతమైన ఫుడ్ డెలివరీ కోసం ప్రయారిటీ ఫీజు పేరిట ఇంకో ప్రత్యేక ఛార్జీని కూడా జొమాటో వసూలు చేస్తోంది. ఒక్కో ఆర్డర్‌పై పొందే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈవిధంగా ఛార్జీలను జొమాటో, స్విగ్గీ బాదుతున్నాయి. తాజాగా ప్లాట్ ఫామ్ ఫీజులను పెంచడం ద్వారా జొమాటో, స్విగ్గీ కంపెనీలకు రోజుకు రూ. 1.25 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల దాకా సంపాదన వస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read :Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్‌కి త్రివిక్రమ్.. ఆర్ట్ డైరెక్టర్ కూడా.. ఎందుకు..?
- బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్‌లు జొమాటో, స్విగ్గీలకు చెందిన క్విక్ కామర్స్ కంపెనీలే. ఇవి కూడా హ్యాండ్లింగ్ ఛార్జీల పేరిట ఫీజు వసూలు చేస్తున్నాయి.
- బెంగళూరులో బ్లింకిట్ ఒక్కో ఆర్డర్‌పై రూ.4, ఇన్‌స్టామార్ట్ రూ.5 వసూలు చేస్తోంది. ఢిల్లీలో ఈ ఛార్జీలు వరుసగా రూ.16, రూ.5గా ఉన్నాయి.
- జనవరిలో స్విగ్గీ కొంత మంది కస్టమర్లకు ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10గా చూపించింది. వాస్తవంగా దాన్ని వసూలు చేయలేదు. రూ.5 రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించి తుది బిల్లులో తగ్గించింది.
- టాటా గ్రూప్‌నకు చెందిన బీబీనౌ రూ.99పైన విలువ చేసే ఆర్డర్లపై రూ.5 హ్యాండ్లింగ్ ఛార్జీలు సేకరిస్తోంది.