Zomato : కస్టమర్లకు షాక్ ఇచ్చిన జొమాటో

తాజాగా ప్లాట్‌ఫామ్ ఫీజును 25 శాతం పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 01:34 PM IST

ప్రస్తుతం జనాలంతా ఆన్లైన్ (Online) కు అలవాటు పడ్డారు..కూర్చున్న దగ్గరి నుండి ఏమాత్రం కదలకుండా కావలసినవన్నీ కాళ్ల దగ్గరకు వచ్చేలా అన్ని ఆన్లైన్ లోనే ఆర్డర్స్ పెట్టేసుకుంటున్నారు. ఉదయం లేచి బ్రెష్ చేసుకునే ఐటెం దగ్గరి నుండి రాత్రి పడుకునేటప్పుడు వేసుకొనే అల్ అవుట్ వరకు అన్ని ఆన్లైన్ లోనే బుక్ చేస్తున్నారు. ఇక ఫుడ్ విషయం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏం తినాలపించిన…ఏ అర్ధరాత్రైనా మీము తీసుకొస్తాం అంటూ జొమాటో (Zomato ) వంటి దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థలు ఉండడం తో ఫుడ్ లవర్స్ అంత జొమాటో కు అలవాటయ్యారు. పెట్రోల్ కొట్టించుకొని రెస్టారెంట్లకు వెళ్లి..ఖర్చు పెట్టి టిప్పు ఇచ్చి బదులు..హ్యాపీ గా జొమాటో లో బుక్ చేసుకొని ఇంట్లోనే తిందామని అంత అనుకుంటూ ఆర్డర్లు పెట్టేస్తున్నారు. దీంతో రోజు రోజుకు జొమాటో ఆర్డర్లు పెరుగుతూ పోతున్నాయి. జొమాటో ప్రతి రోజూ 20-22 లక్షల ఆర్డర్లను తీసుకుంటోంది అంటే జొమాటో కు ఏ రేంజ్ లో అలవాటు పడ్డారో అర్ధం చేసుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

అలాంటి జొమాటో వరుసగా కస్టమర్లకు షాక్ లు ఇస్తూ వస్తుంది. తాజాగా ప్లాట్‌ఫామ్ ఫీజును 25 శాతం పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. కంపెనీ అధికారిక యాప్‌ ప్రకారం, ఏప్రిల్ 20 నుంచి ఒక్కో ఆర్డర్‌పై రూ. 5 వసూలు చేయడం ప్రారంభించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, లక్నో సహా కీలక నగరాల్లో జొమాటో ఆర్డర్లపై ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. జనవరి 1న జొమాటో కస్టమర్ల ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.3 నుంచి రూ. 4కి పెంచిన సంగతి తెలిసిందే. ఐదు నెలలు గడవకముందే మరో రూపాయి పెంచడం ద్వారా వినియోగదారులపై భారం మోపింది. ఆర్డర్లపై రూ. 1 పెంచడం ద్వారా కంపెనీ తన ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను చూడనుంది. జొమాటో పోటీ కంపెనీ స్విగ్గీ సైతం ఫుడ్ డెలివరీ ఆర్డర్లపై రూ. 5 ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేస్తోంది. అయినప్పటికీ కస్టమర్లు మాత్రం ఆర్డర్లు తగ్గించడం వంటివి చేయడం లేదు.

Read Also : Everest – MDH : ఎవరెస్ట్, ఎండీహెచ్‌లకు షాక్.. మసాలా ఉత్పత్తులపై మరో బ్యాన్