యూజర్లకు షాక్ ఇచ్చింది యూట్యూబ్ (YouTube ). యాడ్స్ లేకుండా కంటెంట్ వీక్షించే ప్రీమియం సబ్స్క్రిప్షన్ (YouTube Premium prices hike in India) ప్లాన్ల ధరలను యూట్యూబ్ పెంచింది. ప్రస్తుతం యూట్యూబ్ వాడకం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఏంజరిగిన దానిని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుండడం..చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్ తో కాలక్షేపం చేస్తుండడం తో యూట్యూబ్ వాడకం పెరిగింది. ఈ క్రమంలో యూట్యూబ్ భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అన్నింటి ధరలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో యూట్యూబ్ కూడా ప్రీమియం ప్లాన్ల ధరలను భారీగా పెంచింది. యూట్యూబ్ ధరల పెంపునకు సంబంధించి ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఇ- మెయిల్స్ పంపడం ప్రారంభించింది. చందా కొనసాగించడానికి వినియోగదారులు కొత్త ధరలను చెల్లించాల్సి ఉంటుంది. అత్యధికంగా యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ ప్లాన్ నెలకు రూ.110 పెరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో రూ.129 ఉన్న వ్యక్తిగత ప్రీమియం నెల ప్లాన్ ధర ఇప్పుడు రూ.149కి చేరింది. ఫ్యామిలీ ప్రీమియం ధర రూ. 189 నుంచి రూ. 299కి, ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ రూ.79 నుంచి 89కి పెరిగాయి. ప్రీపెయిడ్ తో పాటు రెన్యువల్ సబ్స్క్రిప్షన్ ధరల్ని కూడా యూట్యూబ్ సవరించింది.
పెరిగిన ధరలు చూస్తే..
వ్యక్తిగత నెలవారి ప్లాన్ : రూ. 129 నుండి రూ. 149కి పెరిగింది.
విద్యార్థి నెలవారి ప్లాన్ : రూ. 79 నుండి రూ. 89కి పెరిగింది.
కుటుంబ నెలవారి ప్లాన్ : రూ. 189 నుంచి రూ.299కి పెరిగింది.
వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారి ప్లాన్ : రూ. 139 నుంచి రూ. 159కి పెరిగింది.
వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్ : రూ. 399 నుంచి రూ. 459కి పెరిగింది.
వ్యక్తిగత వార్షిక ప్రణాళిక : రూ. 1,290 నుంచి రూ. 1,490కి పెరిగింది.
Read Also : Patnam Mahender : బిల్డింగ్ అక్రమమని తేలితే నేనే కూల్చేస్తా..పట్నం మహేందర్