Site icon HashtagU Telugu

CIBIL Score: సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నా లోన్ ఎందుకు రిజెక్ట్ చేస్తారు?

CIBIL Score

CIBIL Score

CIBIL Score: బ్యాంక్ నుండి రుణం (Loan) పొందడానికి CIBIL స్కోర్ (CIBIL Score) ఉండటం చాలా అవసరం. ఇది లేకుండా రుణం పొందడంలో మీకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. సిబిల్ స్కోర్ లేకుండా కూడా మీకు రుణం లభించే అవకాశం ఉంది. అయితే అందులో బ్యాంక్ మీ నేపథ్యాన్ని (బ్యాక్‌గ్రౌండ్‌), చెల్లింపుల చరిత్రను (Payment History) తనిఖీ చేస్తుంది. అయినప్పటికీ,సిబిల్ స్కోర్ బాగుంటే, రుణం పొందడం చాలా సులభం అవుతుంది.

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్ స్కోర్‌ను క్రెడిట్ స్కోర్ అని కూడా అంటారు. ఇది 300-900 మధ్య ఉండే 3 అంకెల సంఖ్య. ఇది మీరు ఎప్పుడైనా క్రెడిట్ కార్డు ఉపయోగించారా లేదా రుణం తీసుకున్నారా అని తెలియజేస్తుంది. ఒకవేళ తీసుకున్నట్లయితే ఆ రుణం డబ్బును లేదా EMI (ఈఎంఐ)ని మీరు ఎంత బాధ్యతగా తిరిగి చెల్లించారో ఇది సూచిస్తుంది. సాధారణంగా 300ను అత్యంత చెత్త స్కోర్‌గా, 900ను అత్యుత్తమ స్కోర్‌గా పరిగణిస్తారు. స్కోర్ బాగుంటే రుణం తక్కువ వడ్డీ రేటుతో (Interest Rate) త్వరగా మంజూరు చేయబడుతుంది.

అయితే కొన్నిసార్లు సిబిల్ స్కోర్ బాగా ఉన్నప్పటికీ లోన్ రిక్వెస్ట్ తిరస్కరించబడుతుంది. ఉదాహరణకు మీ సిబిల్ స్కోర్ 750 ఉంటే అది మంచి స్కోర్‌గానే పరిగణించబడుతుంది. కానీ కొన్నిసార్లు 750 సిబిల్ స్కోర్ ఉన్నా కూడా లోన్ రిజెక్ట్ అవుతుంది. దీని వెనుక కారణం ఏమై ఉంటుందో మీకు తెలుసా?

Also Read: Amazon Lay Offs : కోట్లలో లాభాలు అయినప్పటికీ ఉద్యోగులను తొలగింపు..ఏంటి ఈ ఘోరం..?

డెబ్ట్-టు-ఇన్‌కమ్ నిష్పత్తి

మీ లోన్ తిరస్కరణకు డెబ్ట్-టు-ఇన్‌కమ్ నిష్పత్తి ఒక ప్రధాన కారణం. మీ నెలవారీ ఆదాయంలో 40 శాతం కంటే తక్కువ మాత్రమే EMIల కోసం ఖర్చు కావాలని బ్యాంక్ కోరుకుంటుంది. ఫైనాన్షియల్ అడ్వైజర్ రితేష్ సభర్వాల్ వివరించిన ప్రకారం.. ఒక వ్యక్తి జీతం రూ. 1 లక్ష అయితే అందులో రూ. 45,000 EMIల కోసం పోతే అప్పుడు మీ DTI 45 శాతం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ CIBIL స్కోర్ 750 ఉన్నప్పటికీ బ్యాంక్ మీకు రుణం ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే బ్యాంక్ మిమ్మల్ని అవసరానికి మించి అప్పుల ఊబిలో ఉన్నవారిగా పరిగణిస్తుంది. DTI ఎక్కువగా ఉండటం అంటే మీరు రుణం తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, దీనివల్ల బ్యాంక్ అప్రమత్తమవుతుంది.

ఒకేసారి ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం

తక్కువ సమయంలో అనేకసార్లు క్రెడిట్ కార్డు లేదా రుణం కోసం దరఖాస్తు చేయడం కూడా సమస్యను పెంచుతుంది. మీరు మూడు నెలల్లో మూడు కంటే ఎక్కువ సార్లు రుణం కోసం రిక్వెస్ట్ చేసి ఉంటే బ్యాంక్ దీనిని ప్రతికూలంగా చూస్తుంది. మీరు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని, ఆర్థిక రిస్క్ ఉందని బ్యాంక్ భావిస్తుంది. అలాగే తరచుగా ఉద్యోగాలు మారే వారికి కూడా రుణం లభించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

స్కోర్‌ను ఎలా మెరుగుపరచాలి?

Exit mobile version