Site icon HashtagU Telugu

UPI Lite : ‘యూపీఐ లైట్‌’ వాడుతున్నారా ? కొత్త ఆప్షన్ గురించి తెలుసుకోండి

Upi Lite Funds Withdrawal To Bank Account Transfer Out Feature Npci

UPI Lite : యూపీఐ యాప్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్‌ను జనం ఎంతగా వినియోగిస్తున్నారో మనకు బాగా తెలుసు. ఈ యాప్‌లలో అందుబాటులోకి వచ్చిన యూపీఐ లైట్‌‌ ఫీచర్‌కు అమిత జనాదరణ లభిస్తోంది. దీనికి సంబంధించిన కొత్త అప్‌డేట్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి.

Also Read :Trump Currency: ట్రంప్ ఫొటోతో కరెన్సీ నోట్లు

మార్చి 31 డెడ్‌లైన్

యూపీఐ లైట్ ఫీచర్‌లో కొత్తగా ‘బ్యాలెన్స్‌ విత్‌ డ్రా’ అనే ఆప్షన్‌ను  తీసుకురానున్నారు. పిన్‌‌ నంబరును ఎంటర్‌ చేయకుండానే యూపీఐ పేమెంట్స్‌ చేసేందుకు  ‘యూపీఐ లైట్‌’ పనికొస్తుంది. ఇప్పటివరకు ఇందులో డబ్బులను జమ చేసే సదుపాయం మాత్రమే ఉండేది. విత్‌డ్రా ఫీచర్ లేదు. యూపీఐ లైట్‌లో జమ చేసిన డబ్బుల్ని ఒకవేళ విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే,  ప్రస్తుతం ఒకే ఒక్క మార్గం అందుబాటులో ఉంది. యూపీఐ లైట్ ఖాతాను నిలిపి వేస్తే, అందులో ఉన్న డబ్బులు మన బ్యాంకు ఖాతాలోకి తిరిగి వచ్చేస్తాయి. యూపీఐ లైట్ ఫీచర్‌ను డీయాక్టివేట్ చేయకుండానే, అందులోని డబ్బులను మనం తిరిగి పొందే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. యూపీఐ లైట్‌ ఫీచర్‌లో  ‘ట్రాన్స్‌ఫర్‌ అవుట్‌’ పేరుతో కొత్త ఆప్షన్‌ను జోడించబోతున్నారు. ఈ ఆప్షన్‌ను క్లిక్ చేయగానే యూపీఐ లైట్‌లోని డబ్బులన్నీ మన బ్యాంకు అకౌంటుకు బదిలీ అయిపోతాయి.  మార్చి 31కల్లా ఈ ఆప్షన్‌ను యూపీఐ లైట్(UPI Lite) ఫీచర్‌‌లో జోడించాలి అంటూ యూపీఐ యాప్‌లకు నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ దిశగా అన్ని యూపీఐ యాప్స్ సాంకేతిక కసరత్తును వేగవంతం చేశాయి.

Also Read:Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల

తప్పుడు నంబరుకు డబ్బులు పంపారా ? 

మనం పొరపాటున తప్పుడు యూపీఐ నంబరుకు డబ్బులను పే చేస్తే ఎలా ? అనే ఆందోళన చాలామందికి ఉంటుంది. అలాంటి వారు గాబరా పడొద్దు. తప్పుడు నంబరుకు డబ్బులు పంపిన వెంటనే మీ బ్యాంకుకస్టమర్ సర్వీస్‌కు కాల్ చేయండి. అక్కడ పూర్తి వివరాలను సమర్పించండి. తర్వాత టోల్ ఫ్రీ నంబర్ 18001201740కు కాల్ చేసి కంప్లయింట్ చేయండి. తప్పుడు UPI IDకి డబ్బులు పంపితే, 24 నుంచి 48 గంటల్లోగా మీ డబ్బులు తిరిగి వస్తాయి. ఈ తరహా లావాదేవీలకు ఒకవేళ మీరు వేర్వేరు బ్యాంకు ఖాతాలను ఉపయోగించి ఉంటే, వారి రీఫండ్ ప్రక్రియకు కొంత ఎక్కువ టైం పడుతుంది.