పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరలకు రెక్కలు..పది గ్రాముల ధర తెలిస్తే షాక్ ..

Gold Price  అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇవాళ‌ రికార్డు స్థాయికి చేరాయి. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గుచూపారు. దీంతో పసిడి, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకాయి. భారత మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈరోజు ఉదయం 10.45 గంటల సమయంలో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర 5.99 శాతం పెరిగి 10 […]

Published By: HashtagU Telugu Desk
Stable gold prices.. What is the exchange rate today?

Stable gold prices.. What is the exchange rate today?

Gold Price  అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇవాళ‌ రికార్డు స్థాయికి చేరాయి. ఇరాన్‌పై సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గుచూపారు. దీంతో పసిడి, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకాయి.

భారత మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈరోజు ఉదయం 10.45 గంటల సమయంలో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర 5.99 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,75,885కి చేరింది. అదేవిధంగా మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 4.24 శాతం వృద్ధితో కిలోకు రూ. 4,01,699 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇదే ధోరణి కనిపించింది.

యూఎస్ డాలర్ బలహీనపడటం, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం కూడా ఈ ర్యాలీకి కారణమైంది. అంతకుముందు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడం కూడా బులియన్ మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతోపాటు అమెరికా-మిత్రదేశాల మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ భయాలు కూడా పసిడికి డిమాండ్ పెంచాయి.

  Last Updated: 29 Jan 2026, 12:19 PM IST