Gautam Adani: గౌతమ్ అదానీ జైలుకు వెళ్లాల్సి వస్తుందా?

US ఫెడరల్ కోర్టులో నేరారోపణ మొదటి దశలో నిందితుడు తనపై మోపబడిన ఆరోపణలకు సంబంధించి వాదించవలసి ఉంటుంది. దీని తరువాత ప్రాసిక్యూషన్, డిఫెన్స్ రెండూ తమ సాక్ష్యాలను అందజేస్తాయి.

Published By: HashtagU Telugu Desk
Gautam Adani

Gautam Adani

Gautam Adani: దేశంలోని బడా వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani), అతని మేనల్లుడు సాగర్ అదానీ (Sagar Adani)లు అమెరికా పెట్టుబడిదారులను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. 2020 నుంచి 2024 మధ్యకాలంలో భారత అధికారులకు 265 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 2236 కోట్లు) లంచం ఇచ్చి కాంట్రాక్ట్‌ను పొందినట్లు అదానీపై ఆరోపణలు ఉన్నాయి. అమెరికా ఫెడరల్ కోర్టులో ఈ కేసు నడుస్తోంది. అభియోగాలు నమోదు చేసిన తర్వాత ప్రాథమిక దశలో కేసు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అదానీపై కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ విషయంలో వారికి ఎలాంటి ఆప్షన్లు ఉన్నాయో తెలుసుకుందాం.

US ఫెడరల్ కోర్టులో నేరారోపణ మొదటి దశలో నిందితుడు తనపై మోపబడిన ఆరోపణలకు సంబంధించి వాదించవలసి ఉంటుంది. దీని తరువాత ప్రాసిక్యూషన్, డిఫెన్స్ రెండూ తమ సాక్ష్యాలను అందజేస్తాయి. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత అదానీ దోషా కాదా అనేది జ్యూరీ నిర్ణయిస్తుంది. అతను దోషిగా తేలితే అమెరికా ప్రభుత్వం అదానీని అప్పగించాల్సిందిగా భార‌త్‌ను అభ్యర్థించవచ్చు. ఎందుకంటే నిందితులు అమెరికా బయటి నుంచి వచ్చిన వారు కాబ‌ట్టి.

Also Read: Ola Launches S1 Z And Gig: రూ. 40 వేల‌కే కొత్త ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌!

US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ) దాఖలు చేసిన అభియోగపత్రంలో గౌతమ్ అదానీ, ఆయ‌న మేనల్లుడు సాగర్ అదానీచ‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్‌లపై తప్పుడు వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు లేవు. గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ సమాచారం అందించింది. అదానీ అధికారులపై లావాదేవీలు, అవినీతి ఆరోపణలపై వివిధ మీడియా సంస్థలు చేసిన కథనాలను ‘తప్పు’ అని AGELపేర్కొంది.

“గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లతో సహా మా డైరెక్టర్లలో కొందరు US ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (FCPA) కింద అభియోగాలు మోపారని అనేక మీడియా కథనాలు పేర్కొన్నాయి” అని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎక్స్ఛేంజ్‌తో దాఖలు చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయని క‌థ‌నాలు వ‌చ్చాయ‌ని.. ఈ క‌థ‌నాలు పూర్తిగా అవాస్త‌వం అని కంపెనీ పేర్కొంది.

  Last Updated: 27 Nov 2024, 09:24 PM IST