Red Briefcase : ఇవాళ (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్ దినం. బడ్జెట్ అనగానే మనకు ఎరుపు రంగులో ఉండే చిన్నపాటి బ్రీఫ్ కేస్ గుర్తుకొస్తుంది. బడ్జెట్ బ్రీఫ్ కేస్ అని గూగుల్‌లో కొడితే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చూపిస్తున్న ఎరుపు రంగు బ్రీఫ్ కేస్ కనిపిస్తుంది. దీన్ని బడ్జెట్ బండిల్ అని కూడా పిలుస్తారు. ఇంతకీ దీనికి, 150 కోట్ల మంది భారతీయులతో ముడిపడిన కేంద్ర బడ్జెట్‌కు సంబంధం ఏమిటి ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Telangana Number 1 : ఆర్థిక సర్వే నివేదికలో ప్రస్తావించిన ‘తెలంగాణ’ ఘనతలివీ
డేంజర్.. సిగ్నల్..
రైల్వే ట్రాక్‌పై రెడ్ సిగ్నల్ ఉంటుంది. రోడ్లపైనా రెడ్ ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది. రెడ్ సిగ్నల్ కనిపిస్తే ఆగిపోవాలని అందరూ అర్థం చేసుకుంటారు. గ్రీన్ సిగ్నల్ కనిపించగానే ముందుకు సాగిపోతారు. అలాంటి ఎరుపు రంగును భారతదేశ బడ్జెట్ బ్రీఫ్‌కేస్(Red Briefcase) కోసం ఎందుకు ఎంచుకున్నారు ? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. ‘రెడ్’ కలర్‌ను డేంజర్ అనే అర్థంలోనూ పరిగణిస్తుంటారు.
Also Read :Plane Crash : షాపింగ్ మాల్‌పైకి దూసుకెళ్లిన విమానం.. ఆరుగురు మృతి
రెడ్ కలర్‌లో మరో కోణం..
- రెడ్ కలర్ అనే దాన్ని ఉత్సాహం, అదృష్టం, సాహసం, కొత్త జీవితం వంటి అంశాలకు ప్రతిబింబంగా పరిగణిస్తారు.
- హిందువుల మతపరమైన పండుగలలో ఎరుపు రంగుకు ప్రాధాన్యత ఉంటుంది.
- ఎరుపు రంగు అనేది శక్తిని సూచిస్తుంది.
- ఎరుపు రంగు శాశ్వతత్వాన్ని, పునర్జన్మను సూచిస్తుంది.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎరుపు రంగు అనేది ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సంకల్ప శక్తిని పెంచుతుంది.
- దేవతలకు పెట్టే బొట్టు, పుణ్యస్త్రీలు పెట్టుకునే బొట్టు కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి.
- ఎరుపు రంగు దుర్గామాతకు, హనుమంతుడికి, లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు.
- శుభ సంకల్పాలలో ఎరుపు రంగు తిలకం తప్పకుండా వాడుతారు.
- వివిధ పూజల సమయంలో దేవతా విగ్రహాల ఎదుట ఎరుపు రంగు వస్త్రాన్నే ఉంచుతారు.
- శుభకార్యాలలో కూడా ఎరుపు రంగు దుస్తులను ధరించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
బడ్జెట్ బ్రీఫ్‌కేస్‌లో ఎరుపు రంగు ఎందుకు ?
కేంద్ర ఆర్థిక మంత్రి వినియోగించే బడ్జెట్ బ్రీఫ్ కేస్ ఎరుపు రంగు వస్త్రంలో ఉంటుంది. ప్రభుత్వం తమ ప్రజలకు శక్తివంతమైన, స్థిరత్వంతో కూడిన బలమైన పాలనను అందిస్తుందనే సందేశాన్ని ఇవ్వడానికే ఎరుపు రంగు వస్త్రాన్ని వినియోగిస్తారు. ఎరుపు రంగు అనేది సూర్యుడు, అగ్ని, జీవితంతో ముడిపడినది. సంపదకు, శ్రేయస్సుకు, అదృష్టానికి దీన్ని చిహ్నంగా నమ్ముతారు. అందుకే బడ్జెట్ బ్రీఫ్ కేసుపై ఎరుపు రంగు వస్త్రాన్ని వినియోగిస్తారు.