Site icon HashtagU Telugu

Gold Silver Prices: బంగారం, వెండి ధ‌ర‌లు ప్ర‌తిరోజు ఎందుకు మారుతుంటాయి?

Gold- Silver Rate

Gold- Silver Rate

Gold Silver Prices: గత రెండు రోజులు త‌ర్వాత‌ బంగారం ధరలు (Gold Silver Prices) మరోసారి పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1480కి పెరిగింది. అదే సమయంలో వెండి ధరలు కిలో రూ.2700కి చేరుకున్నాయి. మంగళవారం (19 నవంబర్ 2024) దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ 0.72 శాతం పెరుగుదలతో 10 గ్రాములు రూ.75,585 వద్ద ముగియగా.. వెండి 0.13 శాతం పెరుగుదలతో కిలో రూ.90,630 వద్ద ముగిసింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024 సందర్భంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX) నవంబర్ 20న ఉదయం సెషన్‌ను (ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు) మూసివేయాలని ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.55 గంటల వరకు సాయంత్రం సెషన్‌లో ట్రేడింగ్‌ జరుగుతుంది.

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,790. కాగా 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.7,889. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,474కి చేరింది. ఈరోజు ముంబైలో బంగారం ధర 10 గ్రాములు రూ.75,790. కాగా, నిన్న అంటే నవంబర్ 19న 10 గ్రాముల బంగారం ధర రూ.75,210. కాగా, వారం క్రితం ముంబైలో బంగారం ధర 10 గ్రాములకు రూ.74,240గా ఉంది.

Also Read: Anmol Bishnoi Custody : అమెరికా ‘ఇమిగ్రేషన్’ కస్టడీకి అన్మోల్‌ బిష్ణోయి.. అయోవా జైలుకు తరలింపు

ఈరోజు అంటే నవంబర్ 20న ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.75,660. కాగా, నిన్న అంటే నవంబర్ 19న 10 గ్రాముల బంగారం ధర రూ.75,080. కాగా వారం క్రితం బంగారం ధర కిలో రూ.74,490. ఈరోజు ఢిల్లీలో వెండి ధర రూ.90,710 వద్ద ట్రేడవుతోంది. కాగా, నిన్న అంటే నవంబర్ 19న కిలో వెండి ధర రూ.90,550గా ఉంది. కాగా, గత వారం కిలో వెండి ధర రూ.89,260గా ఉంది.

ఈరోజు చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర రూ.76,010. నిన్న ఇక్కడ బంగారం ధర 10 గ్రాములకు రూ.75,420. కాగా వారం క్రితం ఇక్కడ బంగారం ధర 10 గ్రాములకు రూ.74,810గా ఉంది. ఈరోజు చెన్నైలో కిలో వెండి ధర రూ.91,140గా ఉంది. కాగా, నిన్న అంటే నవంబర్ 19వ తేదీన కిలో వెండి ధర రూ.90,970గా ఉంది. కాగా, చెన్నైలో వారం క్రితం వెండి కిలో ధర రూ.89,620గా ఉంది.

బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు

బంగారం, వెండి ధ‌ర‌లు ఆయా ప్రాంతాల ల‌భ్య‌త‌, ఆర్థిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యిస్తారు. ముఖ్యంగా డిమాండ్, స‌ర‌ఫ‌రా, ద్ర‌వ్యోల్బ‌ణం, వ‌డ్డీ రేట్లు, రుతు ప‌వ‌నాలు, కరెన్సీలో హెచ్చుతగ్గులు, దిగుమతి సుంకం, ఇతర ఆస్తులతో సంబంధం, ముడి చమురు ధరలు లాంటి అంశాల‌పై ఆధార‌ప‌డి ప్ర‌తిరోజు ధ‌ర‌లు మారుతుంటాయి.