Hate Rich People : ధనవంతులు, పేదల ఆలోచనా విధానంతో ముడిపడిన అంశంపై జెరోధా సీఈఓ నితిన్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మన దేశంలో ఎవరైనా బాగా సంపాదించి కార్లు, ఇళ్లను కొనుక్కుంటే .. వాళ్లు ఏదో తప్పు చేసి సంపాదించినట్టుగా అందరూ చూస్తుంటారు. ఇలా ఎదిగిన వాళ్లపై చాలామందిలో ద్వేషభావం కూడా ఉంటుంది. దీనికి కారణమేంటి ?’’ అని నితిన్ కామత్‌ను ఓ మీడియా సంస్థ ప్రతినిధి ప్రశ్నించారు.
Also Read :Hassan Nasrallah : హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం.. బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి
దీనికి నితిన్ బదులిస్తూ.. ‘‘దేశ సంపద పంపిణీలో అసమానతలే దీనికి కారణం. మన సమాజంలో ఉన్న సోషలిస్టు ఆలోచనా దృక్పథమే దీనికి కారణం. అమెరికాలాంటి పెట్టుబడిదారీ వ్యవస్థ కలిగిన దేశాల్లో ఇలా ఆలోచించరు. ఇతరులపై ద్వేషం పెంచుకోరు. ఇతరులను కష్టపడే జీవులుగా మాత్రమే చూస్తారు’’ అని చెప్పారు. ‘‘మన దేశంలో పెట్టుబడిదారీ తనం పేరుకే ఉంటుంది. మన గుండెల నిండా సోషలిజమే(Hate Rich People) ఉంటుంది. అందుకే మన దేశంలో పేదలు అలా ఆలోచిస్తారు’’ అని నితిన్ కామత్ చెప్పుకొచ్చారు.
Also Read :Hezbollah : హిజ్బుల్లాకు షాక్.. హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా మృతి
నకిలీ డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల స్కాం
డిస్కౌంట్ బ్రోకరేజీ సర్వీసులకు కేరాఫ్ అడ్రస్ జెరోధా. జెరోధాకు చెందిన మాజీ పర్సనల్ క్లయింట్ అసోసియేట్ కిషన్ సోనీ గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా నకిలీ డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను క్రియేట్ చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ వ్యవహారంలో కిషన్ సోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రెండేళ్ల కాలంలో కిషన్ సోనీ 432 నకిలీ డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను క్రియేట్ చేశాడని విచారణలో వెల్లడైంది. ఈ నకిలీ ఖాతాల ద్వారా తొలుత అతడు భారీగా కమీషన్లు సంపాదించాడు. ఈవిషయాన్ని జెరోధా చాలా ఆలస్యంగా గుర్తించి విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. దీంతో సీఐడీ క్రైమ్ బ్రాంచ్ 15 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది.