Oil Firms : స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ అతిపెద్ద చమురు సంస్థలపై కొరడా ఝుళిపించాయి. వాటిపై భారీగా జరిమానాలు విధించాయి. ఇంతకీ ఎందుకు ? వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
స్టాక్ ఎక్స్ఛేంజీల నిబంధనల ప్రకారం.. కంపెనీల బోర్డుల్లో నిర్దేశిత సంఖ్యలో స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. మహిళా డైరెక్టర్లు ఉండాలి. అయితే ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఆయిల్ ఇండియా, గెయిల్, మంగళూరు రిఫైనరీ(Oil Firms) వంటి కంపెనీల బోర్డులలో తగిన సంఖ్యలో స్వతంత్ర డైరెక్టర్లు కానీ, మహిళా డైరెక్టర్లు కానీ లేరు. స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యే కంపెనీలు ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలి. కానీ ఈ కంపెనీల్లో అలా జరగకపోవడంపై బీఎస్ఈ, ఎన్ఎస్‌ఈ ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నామని వెల్లడించాయి. దీనిపై ఆయా కంపెనీలను వివరణ కోరాయి. వరుసగా ఐదో త్రైమాసికంలో ఈ కంపెనీలపై జరిమానాలు విధించినట్లు తెలుస్తోంది. ఇక ఈ జరిమానాల వివరాలను ఆయా కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన ఫైలింగ్‌లో ప్రస్తావించాయి.
Also Read :Train Force One : ఉక్రెయిన్‌కు ‘ట్రైన్ ఫోర్స్ వన్’ రైలులో ప్రధాని మోడీ.. దీని ప్రత్యేకతలివీ
స్టాక్ ఎక్స్ఛేంజీలు జరిమానా విధిస్తూ పంపిన నోటీసులపై ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఆయిల్ ఇండియా, గెయిల్, మంగళూరు రిఫైనరీ కంపెనీలు వివరణ ఇచ్చాయి. ‘‘మావి ప్రభుత్వ రంగ సంస్థలు. మా కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్ల నియామకం అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెట్రోలియం, సహజవాయు శాఖ చేతుల్లో ఉంటుంది. నియామకాలతో మా కంపెనీలకు ఎలాంటి సంబంధం ఉండదు’’ అని వెల్లడించాయి. ఇది తమ కంపెనీల నిర్లక్ష్యం కాదని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో జరిమానాను రద్దు చేయాలని ఆయా సంస్థలు కోరాయి.
Also Read :Hydra Report : అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. ప్రభుత్వానికి హైడ్రా నివేదిక
ఆగస్టు 27 నుంచి ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ ఐపీఓ
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కోసం ఎల్లుండి నుంచి మరొక కొత్త ఐపీఓ అందుబాటులోకి రానుంది. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్‌కు సంబంధించిన ఐపీఓ ఆగస్టు 27 నుంచి సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానుంది. ఈ ఐపీఓ ఆగస్టు 27 నుంచి ఓపెన్ అయ్యి ఈనెల 29 వరకు అందుబాటులో ఉండనుంది.ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 2830.40 కోట్లను సమీకరించాలని భావిస్తుంది. ఐపీవో ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 427 నుంచి రూ. 450గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీఓలో పాల్గొనాలనుకునే పెట్టుబడిదారులు కనీసం 33 షేర్లను కొనాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ. 14,850 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ కంపెనీ ఈక్విటీ షేర్లు సెప్టెంబర్ 3న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి.