Site icon HashtagU Telugu

Monthly Interest Income : ప్రతినెలా వడ్డీ ఆదాయం కావాలా ? ఇవిగో టాప్ సేవింగ్స్ స్కీమ్స్

Monthly Interest Income Top Savings Schemes

Monthly Interest Income : తమ దగ్గర ఉండే డబ్బు ప్రతినెలా ఆదాయాన్ని సంపాదించి పెట్టాలని ఎవరికి మాత్రం ఉండదు. ప్రత్యేకించి వడ్డీ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నెలవారీ ఆదాయాన్ని ఆర్జించాలని చాలామంది భావిస్తుంటారు. ఇందుకోసం మంచి సేవింగ్స్ కమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్(Monthly Interest Income) ఏమైనా ఉన్నాయా ? అనేది వెతుకుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ విలువైన సమాచారం..

We’re now on WhatsApp. Click to Join

ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 

ప్రతినెలా వడ్డీ ఆదాయం రావాలి. పన్ను మినహాయింపులు కూడా లభించాలని భావించే వారి కోసం బ్యాంకులు ఒక స్కీంను అమలు చేస్తున్నాయి. అదే ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం. ఎవరైనా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే వడ్డీరేటు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటుంది. ఎక్కువ వడ్డీరేటు ఇచ్చే బ్యాంకును  ఎంపిక చేసుకుంటే బెటర్. చాలా బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు 7.5 శాతం, 60 ఏళ్ల లోపు వారికి 7 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఈ స్కీంలో డబ్బును ఐదేళ్ల  వ్యవధి కోసం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.  అప్పుడే మనకు ప్రతినెలా వడ్డీ ఆదాయం లభిస్తుంది. మనం పెట్టుబడి పెట్టే డబ్బులో దాదాపు రూ.1.5 లక్షలకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపును పొందొచ్చు. దీనికోసం మనం ఆదాయపు పన్ను శాఖ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు.

Also Read :Mpox Cases : ఏయే దేశాల్లో ఎన్ని మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి అంటే..

పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం

పోస్టాఫీసులు.. కేంద్ర ప్రభుత్వానికి చెందినవి. అందుకే వీటిలో పెట్టుబడి పెట్టే డబ్బులకు ఢోకా ఉండదు. మంచి వడ్డీ ఇచ్చే పెట్టుబడి స్కీమ్స్ పోస్టాఫీసుల్లో దొరుకుతాయి.   ఇప్పుడు మనం చెప్పుకోబోయే ‘పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం’ కూడా అలాంటిదే.  ఇందులో మనం కనిష్ఠంగా రూ.1000 నుంచి మొదలుకొని గరిష్ఠంగా రూ.9 లక్షల దాకా ఏకకాలంలో డిపాజిట్ చేసేయొచ్చు. ఒకరికి మించి వ్యక్తులు ఉంటే.. వారంతా కలిసి రూ.15 లక్షలను ఈ స్కీంలో పెట్టుబడిగా పెట్టొచ్చు. ఆ పెట్టుబడి మొత్తానికిగానూ మనకు ప్రతినెలా వడ్డీ ఆదాయం వస్తుంటుంది. మనం పెట్టుబడి పెట్టే డబ్బుపై 7.4 శాతం చొప్పున లెక్కేసి మన అకౌంటులో ప్రతినెలా వడ్డీ ఆదాయాన్ని జమ చేస్తారు. ఈ స్కీంలో కనీసం ఐదేళ్ల పాటు పెట్టుబడి మొత్తాన్ని మనం ఉంచాల్సి ఉంటుంది.  పదేళ్లకు పైబడిన ప్రతి ఒక్కరి పేరిట ఈ స్కీంలో పెట్టుబడులు జమ చేయొచ్చు.

Also Read :BRS : బీఆర్​ఎస్ బలోపేతం కోసం ‘రీజియనల్’ మంత్ర!

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం

ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వారు,  వృద్ధుల కోసం కూడా నెలవారీ ఆదాయాన్ని అందించే కొన్ని పెట్టుబడి పథకాలు ఉన్నాయి. ఆ వయసులో వారు పనిచేసే అవకాశం ఉండదు కాబట్టి.. నెలవారీ ఆదాయం వస్తుంటే జీవితానికి కొంత భరోసా లభిస్తుంది. ఇలాంటి వారి కోసమే ‘సీనియర్​ సిటిజన్​ సేవింగ్​ స్కీమ్​’ను అమల్లోకి తెచ్చారు. 60 ఏళ్లు నిండినవారు కూడా ఈస్కీంలో చేరొచ్చు. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. ఈ స్కీంలో కనీసం ఐదేళ్ల వ్యవధి కోసం డబ్బును డిపాజిట్ చేయాలి. అవసరం అనుకుంటే ఈ స్కీంను మూడేళ్లు చొప్పున పొడిగించుకుంటూ పోవచ్చు. రూ.1000 నుంచి రూ.30 లక్షల దాకా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఈ స్కీంలో మూడు నెలలకోసారి వడ్డీని చెల్లిస్తారు. ఈ స్కీం వడ్డీరేటు బ్యాంకులతో పోలిస్తే ఎక్కువే. డిపాజిట్ చేసే మొత్తంపై 8.2 శాతం వడ్డీరేటును చెల్లిస్తారు. ఈ స్కీంలో చేరితే మీకు లభించే ఆదాయంలో రూ.1.5 లక్షల వరకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపునకు అర్హత సాధిస్తుంది.