Fastest UPI : ఇప్పుడు యూపీఐ పేమెంట్ల హవా వీస్తోంది. అందరూ పేమెంట్ల కోసం యూపీఏ యాప్‌లపై ఆధార పడుతున్నారు. సగటున ఒక యూపీఐ పేమెంట్ పూర్తి కావడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసా ? సగటున 30 సెకన్ల సమయంలో యూపీఐ పేమెంట్ కంప్లీట్ అవుతుంది. మనం యూపీఐ లావాదేవీ చేసినప్పటి నుంచి తుది సందేశం వచ్చేంత వరకు పట్టే టైంను యూపీఐ లావాదేవీ టైంగా పరిగణిస్తారు. ఈ టైం జూన్ 16 నుంచి మరింత తగ్గనుంది. ఫలితంగా యూపీఐ లావాదేవీల వేగం పెరగనుంది. ఎలా ? ఎంత ? అనేది తెలుసుకుందాం..
Also Read :Electoral Rolls : ఇక జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా లింక్
ఆ రెండు టైంలు తగ్గుతాయి..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) తాజా ఆదేశాల ప్రకారం.. యూపీఐ యాప్‌ల ద్వారా జరిపే లావాదేవీలు జూన్ 16వ తేదీ నుంచి 15 సెకన్లలోనే పూర్తి కానున్నాయి. అంటే ఈ టైం ప్రస్తుతమున్న 30 సెకన్ల నుంచి 15 సెకన్లకు తగ్గిపోనుంది. దీంతోపాటు యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ స్టేటస్, ట్రాన్సాక్షన్ రివర్సల్, అడ్రస్ వ్యాలిడేషన్ సమయం కూడా 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గిపోనుంది. ఫలితంగా యూపీఐ యాప్‌ల యూజర్లకు మరింత వేగవంతమైన సేవలు అందనున్నాయి. జూన్ 16 నుంచి ఈ టైంలు తగ్గేలా చూడాలంటూ పేటీఎం, ఫోన్ పే వంటి యూపీఐ కంపెనీలు, బ్యాంకులకు ఎన్‌పీసీఐ నిర్దేశించింది.
Also Read :CM Revanth Team: సీఎం రేవంత్ టీమ్‌లో మార్పులు.. సన్నిహితులకు కీలక బాధ్యతలు
జూన్ 30 నాటికి మరో ఫీచర్
జూన్ 30 నాటికి యూపీఐ(Fastest UPI) యాప్‌లలో మరో ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. దీనివల్ల మనం పేమెంట్ చేసే వ్యక్తి పేరు ప్రదర్శించబడే విధానం మారుతుంది. మనం చెల్లింపునకు ముందు యాప్‌లో కనిపించే పేరు అనేది ధృవీకరించబడిన పేరు. అంటే బ్యాంకింగ్ రికార్డులలో ఉన్న పేరే ఇకపై మనకు కనిపిస్తుంది. ఈ ఫీచర్ వల్ల మనం పంపే డబ్బులు తప్పుడు ఖాతాకు బదిలీ అయ్యే ముప్పు ఉండదు. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత.. మనం చెల్లించే డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్తోందో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఫలితంగా డబ్బు సరైన వ్యక్తికి బదిలీ అవుతుంది.