TV Channels : డీటీహెచ్ ద్వారానో.. కేబుల్ కనెక్షన్ ద్వారానో మనం టీవీ ప్రసారాలను ఎంజాయ్ చేస్తుంటాం. రోజూ ఎన్నో టీవీ ఛానళ్లు చూస్తుంటాం. టీవీ ఛానళ్ల రేట్లు పెరిగి చాలా రోజులైంది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కూడా ముగియడంతో త్వరలోనే రేట్లు పెంచేందుకు టీవీ ఛానళ్లు రెడీ అవుతున్నాయి. దీంతో సామాన్యుల జేబుకు మరో చిల్లు పడనుంది.
We’re now on WhatsApp. Click to Join
టీవీ ఛానళ్ల చందా రుసుములు గరిష్ఠంగా 8 శాతం దాకా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. డిస్నీ స్టార్, వయాకామ్ 18, జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా వంటి బ్రాడ్‌కాస్టర్లు తమ ఛానళ్ల ధరలను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. కొన్ని టీవీ ఛానళ్ల సబ్ స్క్రిప్షన్ రేట్లు 5 శాతంలోపే పెరుగుతాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈమేరకు పెంచిన టారిఫ్ రేట్ల వివరాలను డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్ల (DPO) వద్దకు టీవీ ఛానల్స్ పంపాయి. అయితే ఆ టారిఫ్ రేట్లకు అంగీకారం తెలపని DPOలకు సిగ్నల్స్‌ను ఆపొద్దని.. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచిచూడాలని టీవీ ఛానళ్లకు గత నెలలో టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ సూచించింది. ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో ఇక టీవీ ఛానళ్లు టారిఫ్ రేట్లపై తమ చర్యలను మొదలుపెట్టనున్నాయి. కొత్త టారిఫ్ రేట్లను అమల్లోకి తెచ్చేందుకు కసరత్తును ఇప్పటికే ప్రారంభించాయి. ఈ ఎఫెక్టుతో గత కొన్ని రోజుల్లో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ(TV Channels) వంటి కొన్ని డీపీఓలు స్వల్పంగా టీవీ ఛానళ్ల రేట్లను పెంచాయి.
Also Read :Govt Dating App : గవర్నమెంట్ డేటింగ్ యాప్.. యువతకు లక్కీ ఛాన్స్
వాస్తవానికి డిస్నీ స్టార్, వయాకామ్ 18, జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ తమ సబ్‌స్క్రిప్షన్ రేట్లను ఈ ఏడాది జనవరిలోనే పెంచాయి. వయాకామ్ 18 తన రేట్లను గరిష్టంగా 25 శాతం పెంచింది. పెద్ద క్రికెట్ టోర్నమెంట్‌ల ప్రసార హక్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల మార్కెట్ వాటా పెరగడం వల్ల ఆ కంపెనీ అడ్వాంటేజ్ తీసుకుంది. కొత్త రేట్లు ఫిబ్రవరి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ట్రాయ్ ఆర్డరు కారణంగా ఆ పెంపు జూన్ 1 వరకు వాయిదా పడింది.