Anil Ambanis Essay : ఇవాళ దివంగత పారిశ్రామిక దిగ్గజం ధీరూభాయ్ అంబానీ జయంతి. ఆయన 1932 డిసెంబరు 28న గుజరాత్‌లోని చోర్వాడ్‌లో జన్మించారు. ఈసందర్భంగా ఆయన కుమారుడు అనిల్ అంబానీ ప్రముఖ వార్తా పత్రికకు వ్యాసం రాశారు. అందులో తన తండ్రి ధీరూభాయ్ అంబానీ గురించి కీలక అంశాలను ప్రస్తావించారు. అవేంటో అనిల్ అంబానీ మాటల్లోనే చూద్దాం..
Also Read :ED Vs KTR : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు
‘‘మా నాన్న ధీరూభాయ్ గుజరాత్‌లోని చోర్వాడ్ గ్రామంలో జన్మించారు. మా తాతయ్య (నాన్న వాళ్ల నాన్న) పేరు హీరాచంద్ గోర్ధన్ భాయ్ అంబానీ. ఆయన ఒక సామాన్య టీచర్. ప్రపంచం మా నాన్నను పారిశ్రామికవేత్తగా చూస్తోంది. కానీ నేను మా నాన్నను స్ఫూర్తిప్రదాతగా చూస్తున్నాను. అంకితభావం, నిబద్ధతలు రంగరించిన మహోన్నతుడు మా నాన్న. ఆయన హనుమాన్ చాలీసా పఠించేవారు. అందులో ఎంతో నాలెడ్జ్ ఉందని మాతో చెప్పేవారు. నమ్మకం ఉంటే ఏదైనా సాధించొచ్చని నాన్న అనేవారు’’ అని అనిల్ అంబానీ వివరించారు. ‘‘మా నాన్న తరుచుగా ఒక వాక్యం చెబుతుండేవారు. హనుమాన్‌ను పూజించడం ద్వారా ఎంతో ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంటుంది అని ఆయన చెప్పేవారు. ఆత్మవిశ్వాసం, నిగ్రహంలతో జీవితంలో నిలదొక్కుకోవడానికి అవసరమైన బలం హనుమాన్ నుంచి లభిస్తుందని అనేవారు’’ అని అనిల్ అంబానీ చెప్పారు.
Also Read :Dhirubhai Ambani Car : ధీరూభాయ్ అంబానీ నడిపిన కారు.. సౌత్ సూపర్‌స్టార్‌కు ఎలా చేరింది ?
‘‘మా నాన్న వ్యాపార ప్రయాణం చిన్నపాటి పెట్టుబడితోనే మొదలైంది. పెట్టుబడి చిన్నగానే ఉన్నా.. మా నాన్న కలలు పెద్దగా ఉండేవి. అందుకే ఈ స్థాయికి మా వ్యాపారాలు చేరాయి. రాముడి కార్యాన్ని పూర్తి చేయడానికి హనుమంతుడు చూపిన నిబద్ధతను స్ఫూర్తిగా తీసుకొని.. వ్యాపారులు ముందుకు సాగాలని నాన్న చెప్పేవారు. లీడర్ అంటే లీడ్ చేసేవాడు కాదు.. మరింత మంది లీడర్లను తయారు చేసేవాడని నాన్న చెబుతుండేవారు’’ అని అనిల్ అంబానీ గుర్తు చేసుకున్నారు. ‘‘మా నాన్న రోజూ సూర్య నమస్కారం చేసి పూజలు నిర్వహించేవారు. ఆదిత్య హ్రిదయం పుణ్యం అని ఆయన చెప్పేవారు. సూర్యుడి నుంచి మనం ధైర్యం, శక్తి, ఏకాగ్రతలను పొందొచ్చని అనేవారు. సమస్యలను సూర్యుడిలా నిలకడగా ఉంటూ ఎదుర్కోవాలనే సందేశాన్ని మా నాన్న వినిపించేవారు.
మా అమ్మ సమాధానం..
నాన్న ఎందుకు అకస్మాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారని అమ్మ కోకిలాబెన్‌ను(Anil Ambanis Essay) నేను అడిగాను. దీనికి మా అమ్మ బదులిస్తూ.. ‘‘మీ నాన్న ఈ భూమిపై ఏమేం చేయాలో అవన్నీ చేశారు. మన కోసం, రిలయన్స్ కోసం, భారత దేశం కోసం అన్నీ చేశారు. స్వర్గంలో సేవలు అందించేందుకు దేవుడు మీ నాన్నను పిలిచారు. అందుకే వెళ్లిపోయారు’’ అని చెప్పిందని అనిల్ అంబానీ వివరించారు.