Site icon HashtagU Telugu

Today Gold Rate: నేటి బంగారం ధ‌ర‌లివే.. పెరిగాయా? త‌గ్గాయా?

Gold Prices

Gold Prices

Today Gold Rate: బంగారం, వెండి ధరల్లో (Today Gold Rate) ఆదివారం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,300. చివరి రోజు ధర 71,290. అదే సమయంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.77,770గా ఉంది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,770. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

మెట్రో న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇవే

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,770గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,150గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,620గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,150గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,620గా ఉంది. బెంగ‌ళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,150గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,620గా ఉంది.

Also Read: IND vs AUS: భార‌త్ ఘోర ఓట‌మి.. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరిన టీమిండియా

తెలుగు రాష్ట్రాల్లో ధ‌ర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ఉంటుంది. ఏ ఫంక్ష‌న్ అయినా ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది బంగారం, వెండి వ‌స్తువులే. ఇక‌పోతే ఆదివారం తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,150గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,620గా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,150గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.77,620గా ఉంది.

వెండి ధ‌ర ఎంతంటే?

వెండి ధరల గురించి మాట్లాడుకుంటే.. వెండి ధరలో స్ప‌ల్ప‌ మార్పు జరిగింది. నేడు కిలో వెండి ధర రూ.92,000. కాగా నిన్న వెండి ధర రూ.91,900. అంటే వెండి ధర రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కిలో వెండి ధ‌ర రూ. ల‌క్ష‌గా ఉంది. పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS, ఇతర ఛార్జీలను కలిగి ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీరు స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించవ‌చ్చు.