Site icon HashtagU Telugu

TikTok Ban : టిక్‌టాక్‌‌కు బ్యాన్ భయం.. ట్రంప్‌తో కంపెనీ సీఈఓ భేటీ.. సుప్రీంకోర్టులో పిటిషన్

Tiktok Ban in Us

TikTok Ban : చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ అమెరికాలో చాలా ఫేమస్. అక్కడ నిత్యం ఎంతోమంది పిల్లలు, పెద్దలు టిక్ టాక్ యాప్‌ను వాడుతుంటారు. అయితే ఇటీవలే టిక్‌టాక్ యాప్‌‌కు పెద్ద షాక్ తగిలింది. దాన్ని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి జనవరి 19లోగా తీసేయాలని అమెరికన్ చట్టసభ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ  గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి టిక్‌టాక్ యాప్‌ను డిలీట్ చేస్తే.. దాన్ని ఇక అమెరికాలో ఎవరూ డౌన్‌లోడ్ చేసుకోలేరు. టిక్‌టాక్ కంపెనీ అమెరికాలో కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తే.. ఆ యాప్‌ను జనవరి 19వ తేదీలోగా వేరే దేశానికి చెందిన కంపెనీకి అమ్మేయాల్సి ఉంటుంది.  లేదంటే బ్యాన్‌ను ఎదుర్కోవాలి. టిక్‌టాక్ యాప్ ద్వారా అమెరికా ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించి చైనా ప్రభుత్వానికి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Also Read :Local Body Reservations : ‘హైడ్రా’ చట్టానికి పచ్చజెండా.. ఇక ఐదేళ్లకోసారి ‘లోకల్ బాడీ’ రిజర్వేషన్లు మార్పు

ఈ పరిణామాల నేపథ్యంలో  టిక్‌టాక్ కంపెనీ సీఈఓ షౌ షి చ్యూ(TikTok Ban) స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన నేరుగా వెళ్లి కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని మార్ ఏ లాగో రిసార్ట్ వేదికగా వీరిద్దరూ సమావేశమయ్యారు. టిక్‌టాక్ బ్యాన్‌ను ఆపాలని ట్రంప్‌ను షౌ షి చ్యూ కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ టిక్‌టాక్‌ను అమెరికాలో బ్యాన్ చేస్తే..  అమెరికా, చైనాల ద్వైపాక్షిక సంబంధాల దాని ప్రభావం పడుతుందని ట్రంప్‌కు షౌ షి చ్యూ చెప్పినట్లు సమాచారం. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టిక్‌టాక్ సీఈవోతో భేటీ తర్వాత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘టిక్‌టాక్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. నాకు ప్రజల్లో పాపులారిటీ పెరగడంలోనూ టిక్ టాక్ కీలక పాత్ర పోషించింది. నేను యువత మనసులను గెలుచుకోగలిగాను’’ అని ట్రంప్  చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి టిక్‌టాక్ విషయంలో ట్రంప్ మెతక వైఖరిని అవలంభించాలని డిసైడ్ అయినట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి మార్ ఏ లాగో రిసార్టులో జరిగిన భేటీలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌లు కూడా పాల్గొన్నారు. అయితే  టిక్‌టాక్ సీఈవోతో ట్రంప్ వ్యక్తిగతంగా వేరుగా మీట్ అయ్యారు.

Also Read :Electric Buses : రాబోయే ఐదేళ్లలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే.. ఏపీ ఆర్టీసీ ప్లాన్

సుప్రీంకోర్టులో పిటిషన్

ట్రంప్‌తో టిక్‌టాక్ సీఈవో భేటీ అనంతరం మరో కీలక పరిణామం జరిగింది. టిక్‌టాక్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి జనవరి 19లోగా తొలగించే డెడ్‌లైన్‌పై స్టే విధించాలని కోరుతూ అమెరికా సుప్రీంకోర్టులో టిక్‌టాక్ పిటిషన్ దాఖలు చేసింది.  దీనిపై కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ అవుతాయో వేచిచూడాలి.