Site icon HashtagU Telugu

Look Back 2024 : ఈ ఏడాది జొమాటో లో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఐటెం ఇదే..

This Is The Most Ordered It

This Is The Most Ordered It

మరో నాల్గు రోజుల్లో కొత్త ఏడాదిలోకి (2025) అడుగుపెట్టబోతున్నాం. 2024 కు గ్రాండ్ గా బై బై చెపుతూ..నూతన ఏడాది 2025 కు వెల్ కం చూపేందుకు ప్రజలంతా సిద్ధం అయ్యారు. ఇప్పటికే ఆ ఏర్పాట్లపై పక్క ప్లాన్తో సిద్ధంగా ఉన్నారు. ఇదే క్రమంలో ఏడాదిలో ఏంజరిగింది..? ఎలాంటి విశేషాలు ఉన్నాయి..? ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి..? అనేది చాల విషయాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (zomato)2024 సంవత్సర ముగింపు నివేదిక విడుదల చేసింది. ఇందులో చాల విషయాలను చెప్పుకొచ్చింది.

ఈ ఏడాది ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ లో బిర్యానీదే (Biryani) నెంబర్ వన్ ప్లేస్ అని జొమాటో తేల్చి చెప్పింది. 2024లో 9,13,99,110 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని , ఆ తర్వాత స్థానంలో 5,84,46,908 పిజ్జా ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. ఇక రైల్వే టికెటింగ్ పోర్టల్ ఐఆర్ సీటీసీతోనూ జొమాటోకు భాగస్వామ్యం ఉంది. జొమాటో నిర్దేశిత రైల్వే స్టేషన్ల నుంచి, రైలు ప్రయాణికులకు వారు కోరుకున్న ఆహారాన్ని సరఫరా చేస్తుంటుంది. ఓసారి ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ 120 మంచూరియా కాంబోలు ఆర్డర్ చేశాడని జొమాటో తన నివేదికలో వెల్లడించింది. అయితే అవన్నీ అతడి ఒక్కడి కోసమే కాదట… ఆ కంపార్ట్ మెంట్ లో ఉన్న అందరి కోసం ఆర్డర్ చేశాడని తెలిపింది. అలాగే ఢిల్లీకి చెందిన ఓ ఆహార ప్రియుడు ఈ ఏడాది 1,377 రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తెప్పించుకున్నాడని వెల్లడించింది. ఇక ఈ ఏడాది 17 మిలియన్ ప్యాక్ ల మ్యాగీ నూడిల్స్, 10 మిలియన్ క్యాన్ల కోకాకోలా ఆర్డర్లు బుక్ అయ్యాయట. ఒక వ్యక్తి 1,203 స్ప్రైట్ బాటిల్స్ ఆర్డర్ చేసినట్టు జొమాటో తెలిపింది. ఓవరాల్ గా అన్ని ఐటమ్స్ లలో బిర్యానీ నే ఎక్కువ సంఖ్యలో ఆర్డర్ చేసినట్లు తెలిపి మరోసారి బిర్యానీ ప్రియులకు ఆకట్టుకుంది.

Read Also : Condoms : హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో కండోమ్ ప్యాకెట్ల బుకింగ్