Bank Holidays – July : జులై నెలలో బ్యాంకు సెలవుల లిస్టు ఇదిగో

మరో రోజు తర్వాత క్యాలెండర్ మారిపోనుంది. మనం జులై నెలలోకి ఎంటర్ అవుతాం.

  • Written By:
  • Updated On - June 29, 2024 / 01:41 PM IST

Bank Holidays – July :  మరో రోజు తర్వాత క్యాలెండర్ మారిపోనుంది. మనం జులై నెలలోకి ఎంటర్ అవుతాం. ఆ నెలలో వివిధ బ్యాంకులకు దాదాపు 12 రోజుల పాటు బ్యాంకు హాలిడేస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ వివిధ రకాల సెలవులు. కొన్ని జాతీయ సెలవులైతే.. మరికొన్ని ప్రాంతీయ సెలవులు. ఈ సెలవులు(Bank Holidays – July) ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది ముందస్తుగా కస్టమర్లు తెలుసుకోవాలి. సెలవు ఉన్నప్పుడు బ్యాంకుకు వెళితే.. కస్టమర్ల టైం వేస్ట్ అయిపోతుంది. ముందస్తుగా వచ్చే నెల కోసం ప్లానింగ్ చేసుకునే వారు తప్పకుండా జులై నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల వివరాలను తెలుసుకోవాలి.  ఈ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) కూడా ఆమోదించింది.

We’re now on WhatsApp. Click to Join

జులైలో బ్యాంకు సెలవుల జాబితా 

  • జులై 3 (బుధవారం) : ఆరోజు బేహ్ డీఇన్కలమ్​ పండుగ ఉంది. మేఘాలయలోని బ్యాంకులకు సెలవు.
  • జులై 6 (శనివారం) : ఆ రోజు ‘మిజో హ్మీచే ఇన్సుయిహ్​ఖామ్​ పాల్’​ ఉంది. ఆసందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు.
  • జులై 7న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు.
  • జులై 8 (సోమవారం) : ఆ రోజు కాంగ్​ రథ యాత్ర ఉంది. ఆ సందర్భంగా మణి‌పూర్‌లోని బ్యాంకులకు సెలవు.
  • జులై 9 (మంగళవారం) : ఆరోజు బౌద్ధులకు పవిత్రమైన ‘ద్రుక్పా త్షే-జి’ వేడుక ఉంది. ఆ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
  • జులై 13 (శనివారం) : ఆ రోజు రెండో శనివారం ఉంది. ఆ సందర్భంగా బ్యాంకులకు హాలిడే.
  • జులై 14న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు.
  • జులై 16 (మంగళవారం) : ఆ రోజు హరేలా పండుగ ఉంది.  ఆ సందర్భంగా ఉత్తరాఖండ్​లోని బ్యాంకులకు సెలవు.
  • జులై 17 (బుధవారం) : ఆ రోజు మొహర్రం/ అషూరా/ యు తిరోట్​ సింగ్​ డే ఉన్నాయి. ఆ సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే జులై 17న గుజరాత్​, ఒడిశా, చంఢీగఢ్​, ఉత్తరాఖండ్​, సిక్కిం, అసోం, మణిపుర్​, ఇటానగర్​, కేరళ, నాగాలాండ్​, గోవాలో బ్యాంకులు పనిచేస్తాయి.
  • జులై 21న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు.
  • జులై 27 (శనివారం) : ఆ రోజు చివరి శనివారం కనుక బ్యాంకులు పనిచేయవు.
  • జులై 28న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు.

Also Read :Future PM : ‘కాబోయే ప్రధానమంత్రి అఖిలేష్’.. పోస్టర్లపై పొలిటికల్ చర్చ

బ్యాంకు సెలవు రోజుల్లో టెన్షన్ పడాల్సిన పనిలేదు. బ్యాంకులు బంద్ ఉన్నప్పుడు మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలను వాడుకోవచ్చు. యూపీఐ, ఏటీఎం సేవలు ఉండనే ఉన్నాయి. మనం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫోన్ నుంచి ఆర్థిక లావాదేవీలను పూర్తి  చేసుకోవచ్చు.