ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశం ఏది?

నేటి (7 ఫిబ్రవరి 2026) ధరలను పోల్చి చూస్తే భారత్ కంటే చైనాలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 16,000 నుండి రూ. 17,500 వరకు తక్కువగా ఉంది.

Published By: HashtagU Telugu Desk
Gold

Gold

Gold: శతాబ్దాలుగా సామ్రాజ్యాలను, ఆర్థిక వ్యవస్థలను, ప్రపంచ శక్తిని బంగారమే శాసిస్తోంది. ప్రాచీన నాగరికతల నుండి నేటి సెంట్రల్ బ్యాంకుల వరకు ఈ విలువైన లోహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే బంగారం ధరలు పెరిగినా, తగ్గినా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంటుంది. దిగ్గజ ఆర్థికవేత్తల ప్రకారం.. బంగారం, వెండి, రాగి వంటి లోహాలు ఏ దేశం వద్ద ఎక్కువగా ఉంటాయో ఆ దేశమే భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశం ఏది?

చైనా గత 10 ఏళ్లకు పైగా ప్రపంచంలోనే నంబర్-1 గోల్డ్ ప్రొడ్యూసర్‌గా చైనా కొనసాగుతోంది. ఇది ఆస్ట్రేలియా, రష్యా వంటి పెద్ద దేశాల కంటే చాలా ముందుంది.

చైనా నంబర్-1 స్థానంలో ఉండటానికి 3 ముఖ్య కారణాలు

గనుల నిల్వలు: చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ వంటి ప్రాంతాల్లో బంగారు గనులు పుష్కలంగా ఉన్నాయి.

హై-టెక్ టెక్నాలజీ: బంగారం తీయడం కష్టతరమైన లేదా ఖరీదైన ప్రాంతాల నుండి కూడా బంగారాన్ని వెలికితీసేందుకు చైనా అత్యాధునిక యంత్రాలు, సాంకేతికతపై భారీగా పెట్టుబడి పెట్టింది.

సొంత బంగారం, సొంత అవసరాలకే: చైనా ప్రత్యేకత ఏమిటంటే తాను తీసిన బంగారాన్ని ఇతర దేశాలకు అమ్మకుండా తన వద్దే ఉంచుకుంటుంది. దీనిని అక్కడి ప్రజలు నగలు తయారు చేసుకోవడానికి లేదా ప్రభుత్వం తన నిల్వలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తుంది.

ప్రపంచంలోని టాప్ 3 బంగారు ఉత్పత్తి దేశాలు

  1. చైనా (అత్యధికం)
  2. ఆస్ట్రేలియా
  3. రష్యా

చైనా ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ బంగారం కొనుగోలు విషయంలో మాత్రం భారత్, చైనా మధ్య ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుంది. అయితే చైనా స్వయంగా బంగారాన్ని వెలికితీస్తుండగా భారత్ తన అవసరాల కోసం దాదాపు పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడుతోంది.

భారత్‌లో ఎంత బంగారం ఉత్పత్తి అవుతుంది?

భారత్ తన మొత్తం అవసరంలో 1% కంటే తక్కువ బంగారాన్ని మాత్రమే సొంతంగా ఉత్పత్తి చేస్తోంది. మన దేశంలో ప్రతి ఏటా సుమారు 1.6 టన్నుల బంగారం మాత్రమే వెలికితీస్తారు (ప్రధానంగా కర్ణాటకలోని ‘హుట్టి’ గనుల నుండి). దీనికి భిన్నంగా భారతీయులు ప్రతి ఏటా దాదాపు 800 నుండి 900 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తారు.

Also Read: తొలి మ్యాచ్‌లో పాక్ స్టార్ ప్లేయ‌ర్‌ బాబర్ ఆజం ఫ్లాప్!

మనం ఎక్కడి నుండి తెప్పించుకుంటాం?

సొంత గనులు తక్కువగా ఉండటం వల్ల భారత్ తన అవసరాల కోసం స్విట్జర్లాండ్, యూఏఈ (దుబాయ్), దక్షిణాఫ్రికా వంటి దేశాల నుండి భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అందుకే డాలర్ విలువ పెరిగినా లేదా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగినా, భారత్‌లో రేట్లు వెంటనే ఆకాశాన్ని తాకుతాయి.

భారత్ వద్ద ఉన్న ‘అసలైన నిధి’

మన గనుల్లో బంగారం తక్కువగా ఉండవచ్చు. కానీ భారతీయ ఇళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిధి ఉంది. ఒక అంచనా ప్రకారం.. భారతీయ కుటుంబాల వద్ద నగలు, నాణేల రూపంలో సుమారు 25,000 నుండి 28,000 టన్నుల బంగారం ఉంది. ఇది ప్రపంచంలోని అనేక పెద్ద దేశాల ప్రభుత్వ రిజర్వుల కంటే చాలా ఎక్కువ. ప్రభుత్వం ఇప్పుడు గనుల వేలం ప్రక్రియను వేగవంతం చేస్తోంది. తద్వారా మనం కూడా చైనా తరహాలో ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేయగలం. కానీ దీనికి ఇంకా చాలా సమయం పడుతుంది.

భారత్ కంటే చైనాలో బంగారం చాలా చౌక!

నేటి (7 ఫిబ్రవరి 2026) ధరలను పోల్చి చూస్తే భారత్ కంటే చైనాలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 16,000 నుండి రూ. 17,500 వరకు తక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం భారత్ ప్రభుత్వం బంగారంపై విధించే భారీ దిగుమతి సుంకం. ఇది కాకుండా వినియోగదారులు 3% జీఎస్టీ (GST) కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నుల కారణంగానే భారత్‌లో బంగారం ధరలు అసలు ధర కంటే చాలా ఎక్కువగా ఉంటాయి.

  Last Updated: 07 Feb 2026, 04:35 PM IST