TRAI New Rule: మీకు కూడా ప్రతిరోజూ ఫేక్ కాల్స్ వస్తున్నాయా? అయితే మీకు త్వరలో ఉపశమనం లభిస్తుంది. ట్రాయ్ కొత్త నిబంధన (TRAI New Rule)ను రూపొందించింది. దీని ప్రకారం ఇప్పుడు టెలికాం కంపెనీలు నకిలీ కాల్‌లకు బాధ్యత వహించాలి. అంటే మీకు కంపెనీ నంబర్ నుండి ఫేక్ కాల్ వస్తే ఆ కంపెనీ చర్య తీసుకోవలసి ఉంటుంది. ఇది మాత్రమే కాదు.. మీరు ఏదైనా తప్పు చేయడానికి లేదా అమ్మకాల కోసం మీ వ్యక్తిగత నంబర్‌ను ఉపయోగిస్తే మీ నంబర్‌ను రెండేళ్లపాటు బ్లాక్ చేయవచ్చని ఓ నివేదిక తెలిపింది. ఈ కొత్త రూల్‌తో ఫేక్ కాల్స్ తగ్గుతాయని, మీ మొబైల్ నంబర్ సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన నియమాలు సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం
టెలికాం కంపెనీలే బాధ్యత వహించాలి: మీకు ఫేక్ కాల్ వస్తే ఆ టెలికాం కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కంపెనీ ఈ సమస్యను పరిష్కరించాలి. అవసరమైన చర్యలు తీసుకోవాలి.
ఫేక్ కాల్స్ నిషేధం: ఈ నిబంధన అమలుతో ఫేక్ కాల్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా.
నంబర్ బ్లాక్ చేయొచ్చు: ఒక వ్యక్తి తన మొబైల్ నంబర్‌ను టెలిమార్కెటింగ్ లేదా ప్రమోషన్ కోసం ఉపయోగిస్తే అతని నంబర్ రెండేళ్లపాటు బ్లాక్ చేయబడుతుంది.
కఠిన చర్యలు: మోసం లేదా స్పామ్ కాల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని TRAI స్పష్టం చేసింది.
Also Read: CM Siddaramaiah : నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..ఎలాంటి తప్పు చేయలేదు: సీఎం సిద్ధరామయ్య
ఈ నిబంధనలు ఎందుకు తీసుకొచ్చారు?
- ఫేక్ కాల్స్ నుండి ప్రజలను రక్షించడానికి
- టెలికాం రంగంలో మోసాలను నిరోధించేందుకు
- సురక్షితమైన టెలికాం వాతావరణాన్ని సృష్టించడానికి
We’re now on WhatsApp. Click to Join.
ఈ నియమం వల్ల ప్రయోజనం ఏమిటి?
- ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ యూజర్లకి తక్కువ ఫేక్ కాల్స్ వస్తాయి
- మోసాల కేసులు తగ్గుతాయి
- సురక్షితమైన టెలికాం సేవను ఆస్వాదించగలుగుతారు
మీరు ఏమి చేయగలరు?
- మీకు ఫేక్ కాల్ వస్తే దాన్ని TRAIకి లేదా మీ టెలికాం కంపెనీకి నివేదించండి.
- తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్‌లకు సమాధానం ఇవ్వవద్దు.
- మీ మొబైల్ నంబర్‌ను సురక్షితంగా ఉంచండి.