Gold Rate : జూలై 19వ తేదీ శనివారం నాడు (ఈరోజు) బంగారం ధరలు మరోసారి భారీ ఎత్తున పెరిగాయి. పసిడి ధర ఇప్పటికే చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,280గా నమోదవ్వగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 91,500కి పెరిగింది. ఇదే సమయంలో వెండి కూడా భారీగా పరిగెత్తుతోంది. ఒక్క కిలో వెండి ధర రూ. 1,25,000ని దాటి రికార్డు స్థాయిని చేరుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే, పసిడి ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగాను, దేశీయంగాను చోటుచేసుకుంటున్న ఆర్థిక మార్పులు, పెట్టుబడిదారుల మనోభావాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా అమెరికాలో బంగారం ధర ఒక్కడిగా పెరుగుతూ ప్రస్తుతం 1 ఔన్స్ ధర $3350కి చేరింది. ఇది ప్రపంచ రికార్డు స్థాయికి చాలా దగ్గరగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: AP Liquor Case : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే ఛాన్స్..?
బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి డాలర్ విలువ పడిపోవడమే. డాలర్ బలహీనత కారణంగా గోల్డ్‌కి డిమాండ్ గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఇటీవల నష్టాల్లో నడుస్తుండటంతో పెట్టుబడిదారులు పసిడిపై దృష్టిసారిస్తున్నారు. దీనివల్ల బంగారంపై మరింతగా డిమాండ్ ఏర్పడి ధరలు పరుగులు పెట్టుతున్నాయి. ఇక, దేశీయ రిటైల్ మార్కెట్లలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో సాధారణ వినియోగదారులు పసిడి కొనుగోలుకు ముందుకు రావడంతో డిమాండ్ మరింతగా పెరుగుతోంది. కానీ ధరల పెరుగుదల వల్ల వారు ఎటూ తేలక, పసిడి కొనుగోలు విషయంలో జంకుతున్నారు. ఇప్పుడు ఆభరణాలు కొనాలంటే గతంతో పోలిస్తే సగటున 20-30 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.
వెండి విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తొలిసారిగా వెండి ధర రూ. 1.25 లక్షలను దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే వెండి ధరలో 40 శాతం మేర పెరుగుదల నమోదైందని విశ్లేషకులు అంటున్నారు. వెండి కూడా పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగపడటం, పెట్టుబడి లక్ష్యంగా మారడం వంటి అంశాల వల్ల దీని డిమాండ్ పెరిగిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చే వారికి ఇది భారంగా మారుతోంది. ఒకరకంగా చెప్పాలంటే, ఇది సాధారణ మధ్య తరగతి ప్రజలకు ఒక పెద్ద ఆర్థిక భారం అవుతుంది. అయితే దీన్ని పెట్టుబడి అవకాశంగా భావిస్తున్న వారు మాత్రం మరింతగా కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయ మార్పులు లేకపోతే, బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కనుక వినియోగదారులు ఆచితూచి ముందడుగు వేయడం ఉత్తమమని నిపుణుల సూచన.