Anant-Radhika Marriage: అనంత్ అంబానీ పెళ్లి ఖ‌ర్చు రూ. 5వేల కోట్లు కాద‌ట‌.. రూ. 6,500కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌..!

దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా పెళ్లి (Anant-Radhika Marriage) బంధంతో ఒక్కటయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Anant-Radhika Marriage

Anant-Radhika Marriage

Anant-Radhika Marriage: దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా పెళ్లి (Anant-Radhika Marriage) బంధంతో ఒక్కటయ్యారు. జూలై 12న రాధిక మర్చంట్‌తో ఏడు అడుగులు వేశారు. అనంత్-రాధికల వివాహం మొదటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఈ పెళ్లి గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో అస‌లు లెక్క బ‌య‌టికి వ‌చ్చింది. అనంత్-రాధికల వివాహ వేడుక ఏడు నెలల పాటు సాగింది. వారిద్దరూ గత ఏడాది డిసెంబర్‌లో నాథ్‌ద్వారాలో నిశ్చితార్థం చేసుకున్నారు. జూలై 12, 2024న ఇద్దరూ జియో కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం చేసుకున్నారు.

వారి వివాహానికి ముందు రెండు ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు కూడా నిర్వహించారు. ఇందులో భారతదేశం, విదేశాల నుండి ప్రముఖులు మాత్రమే కాకుండా పెద్ద వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కి మొదట చేరుకున్న రిహానా ప్రదర్శన చేయడానికి రూ.74 కోట్లు వసూలు చేయగా, జస్టిన్ బీబర్ రూ.84 కోట్లు తీసుకున్నారు. పెళ్లికి ముందు నుండి పెళ్లి వరకు ముఖేష్ అంబానీ త‌న చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహం కోసం ఎంత డబ్బు ఖర్చు చేశాడో తెలుసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ ఎదురుచూస్తున్నారు.

Also Read: CM Revanth : 27న జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్‌

అనంత్ అంబానీ పెళ్లికి ఖర్చు ఎంతంటే?

నివేదికల ప్ర‌కారం.. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహానికి 5000 కోట్లు ఖర్చు చేశారు. ముందుగా వారిద్దరి ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ ఈ సంవత్సరం మార్చిలో నిర్వ‌హించారు. ఇందులో మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రీ వెడ్డింగ్‌లో గ్లోబల్ స్టార్ రిహానా కూడా హాజ‌ర‌య్యారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు రూ.1000 కోట్లు ఖర్చయ్యాయి. ఈ సమయంలో జామ్‌నగర్‌లో సుమారు మూడు వందల యాభై విమానాల కదలిక కనిపించింది.

We’re now on WhatsApp. Click to Join.

జామ్‌నగర్‌ తర్వాత అనంత్- రాధికల రెండవ ప్రీ వెడ్డింగ్ పార్టీ మే 28 నుండి జూన్ 1 వరకు క్రూయిజ్‌లో జ‌రిగింది. ఈ పార్టీలో ముఖేష్ అంబానీకి చెందిన విఐపి అతిథులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో అంబానీ కుటుంబం తమ అతిథుల కోసం 10 చార్టర్ విమానాలను బుక్ చేసింది. పెళ్లికి ముందు జరిగిన ఈ వేడుక‌లో కూడా త‌క్కువ ఖ‌ర్చు కాలేదు. ఈ పార్టీలో ముకేశ్ అంబానీ రూ.500 కోట్లు ఖర్చు చేసిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి.

మొత్తం ఖ‌ర్చు ఎంత‌..?

వివిధ మీడియా నివేదికల నుండి అందిన సమాచారం ప్రకారం.. ముకేశ్ అంబానీ పెళ్లికి ముందు నుండి అనంత్ అంబానీ కోసం నిర్వహించిన వివాహ వేడుక వరకు చాలా ఖర్చు చేశారు. ఇవి కలిపితే ముఖేష్ అంబానీ రూ.6,500 కోట్లు ఖర్చు చేశారని స‌మాచారం. అయితే ముకేష్ అంబానీకి ఇది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఈ నెలలో ముఖేష్ అంబానీ నికర విలువ పెరిగింది. ఇప్పుడు అత‌ని సంప‌ద 121 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

  Last Updated: 24 Jul 2024, 11:38 PM IST