Site icon HashtagU Telugu

TCS Layoffs: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు టీసీఎస్ భారీ షాక్..ఏకంగా 12 వేల మంది తొలగింపు

Labor Ministry

Labor Ministry

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ తాజాగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సంస్థ మొత్తం ఉద్యోగులలో 2 శాతం మందిని తొలగించనుందని పేర్కొంది. ఈసారి తొలగింపులు ముఖ్యంగా మిడిల్స్ మరియు సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలలో ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం 2026 ఆర్థిక సంవత్సరంలో అమలు కానుంది.

టీసీఎస్ ప్రస్తుతం కొత్త టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగాన్ని పెంచడం, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం వంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో కంపెనీలో ఉన్న ఉద్యోగులను ఏఐ పైన తిరిగి శిక్షణ ఇచ్చే ప్రక్రియ కూడా జరుగుతోంది. ఇదే సమయంలో పాత టెక్నాలజీపై పనిచేస్తున్న ఉద్యోగుల అవసరం తగ్గిపోవడం వల్లే లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Apples With Peel : యాపిల్ పండ్ల‌ను మీరు ఎలా తింటున్నారు ? తొక్క‌తో స‌హా తినాల్సిందే.. ఎందుకంటే..?

కస్టమర్ల నుంచి వచ్చే ప్రాజెక్టులు ఆలస్యం కావడం, అమెరికాలో వాణిజ్య విధానాల్లో ఉన్న అనిశ్చితి, ఖర్చుల నియంత్రణ వంటి అంశాలపై కంపెనీ దృష్టిసారించింది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉద్యోగులను కొనసాగించడం వ్యయపరంగా భారంగా మారుతుందని టీసీఎస్ అభిప్రాయపడుతోంది. CEO కృతివాసన్‌ ప్రకారం.. క్లయింట్లు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తుండటం వల్ల కంపెనీ టర్నోవర్‌పై కూడా ప్రభావం పడుతోందని తెలిపారు.

టీసీఎస్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌ వంటి గ్లోబల్ ఐటీ సంస్థలు కూడా పెద్దఎత్తున ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 24,000 ఐటీ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నట్లు అంచనా. ఏఐ వంటి సరికొత్త టెక్నాలజీలు పాత విధానాల స్థానాన్ని దక్కించుకుంటున్నాయి. ఒకరిద్దరు ఉద్యోగుల ద్వారా పెద్ద పనులు చేయగల టెక్నాలజీ అందుబాటులోకి రావడం, సంస్థలకు ఖర్చుల తగ్గింపు అవసరం పెరగడం ఈ లేఆఫ్స్‌కి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.