TCS CEO : ఆ కంపెనీ సీఈవో శాలరీ సంవత్సరానికి రూ.25 కోట్లు

TCS CEO  : సంవత్సరానికి  రూ.25.36 కోట్ల శాలరీ. ఎవరికో తెలుసా ?

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 04:00 PM IST

TCS CEO  : సంవత్సరానికి  రూ.25.36 కోట్ల శాలరీ. ఎవరికో తెలుసా ? టీసీఎస్ కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కె. కృతివాసన్‌కు!! ఈయన గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రూ.25.36 కోట్ల శాలరీ తీసుకున్నారు.  ఇందులో రూ.1.27 కోట్ల నికర వేతనం, రూ. 3.08 కోట్ల ఇతర ప్రయోజనాలు, భత్యాలు, అలవెన్సులు, రూ. 21 కోట్ల కమీషన్ ఉన్నాయి. ఈవివరాలను  టీసీఎస్ కంపెనీ గురువారం వెల్లడించింది. రాజేష్ గోపీనాథన్ ఆకస్మిక నిష్క్రమణ తర్వాత 2023 జూన్‌లో టీసీఎస్ సీఈవో పగ్గాలను ఐదేళ్ల కాలం కోసం కృతివాసన్ చేపట్టారు. కంపెనీ మాజీ సీఈఓ రాజేష్ గోపీనాథన్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.29.16 కోట్లు ఆర్జించారు. ఇది ప్రస్తుత సీఈఓ(TCS CEO)  కృతివాసన్‌ వేతనం కంటే కొంచెం ఎక్కువే.

We’re now on WhatsApp. Click to Join

టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం.. 

  • టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఎన్జీ సుబ్రమణ్యం కూడా గత ఆర్థిక సంవత్సరంలో రూ.26.18 కోట్ల స్థూల వేతనాన్ని ఆర్జించారు.
  • సుబ్రమణ్యం ఆర్జించిన మొత్తం రూ.26.18 కోట్ల స్థూల వేతనంలో.. రూ.1.72 కోట్ల నికర వేతనం, రూ.3.45 కోట్ల ఇతర ప్రయోజనాలు, భత్యాలు, అలవెన్సులు, రూ.21 కోట్ల కమీషన్ ఆదాయం ఉన్నాయి.

Also Read :Terrorists Attack : గాఢ నిద్రలో ఉండగా ఏడుగురు కార్మికుల కాల్చివేత

  • టీసీఎస్ ఉద్యోగుల సగటు వార్షిక వేతన పెరుగుదల 5.5 శాతం నుంచి 8 శాతం రేంజులో ఉంది.భారతదేశంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే టీసీఎస్ ఉద్యోగులకు రెండంకెల ఇంక్రిమెంట్లు కూడా ఇస్తున్నారు.
  • గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి టీసీఎస్ మానవ వనరుల్లో 35.6 శాతం మంది మహిళలు ఉన్నారు.
  • కంపెనీ ఉద్యోగులలో దాదాపు 55 శాతం మంది ఆఫీసు నుంచే పని చేస్తున్నారు.
  • కంపెనీ రెవెన్యూ వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంలో 17.6 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గింది.

Also Read :Telangana Student Missing : అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్.. ఏమైంది ?