Cricketers Tax Strategy : టీమిండియా క్రికెటర్లు ఎంతగా సంపాదిస్తారో మనకు బాగా తెలుసు. ఒక టెస్ట్ మ్యాచ్‌కు రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షలు, ఒక వన్డే మ్యాచ్‌కు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు, ఒక టీ20 మ్యాచ్‌కు రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల దాకా వస్తుంటాయి. ఇక టీమిండియాలోని 15 మంది జూనియర్ క్రికెటర్లకు ఏడాదికి రూ.1 కోటి చొప్పున ఇస్తారు. నలుగురు సీనియర్ ప్లేయర్లకు ఏడాదికి రూ.7 కోట్లు చొప్పున ఇస్తారు. మరో ఆరుగురు సీనియర్లకు రూ.5 కోట్లు చొప్పున ఇస్తారు. ఇంకో ఐదుగురు ప్లేయర్లకు రూ.3 కోట్లు చొప్పున ఇస్తారు. వీటికితోడు ఐపీఎల్ మ్యాచ్‌ల ఫీజులు, విదేశీ లీగ్ మ్యాచ్‌ల ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, సొంత వ్యాపారాల ద్వారా భారత క్రికెటర్లు బాగానే సంపాదిస్తారు.అయినా వారు కొన్ని పన్ను వ్యూహాలతో తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఆదాయం(Cricketers Tax Strategy)పై పన్ను మోత పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ పన్ను వ్యూహాల గురించి మనం కూడా తెలుసుకుందాం..
Also Read :Credit Cards : విద్యార్థులకూ క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తారు.. అప్లై చేయడం ఈజీ
భారత క్రికెటర్ల ట్యాక్స్ ప్లానింగ్ ఇలా..
- టీమిండియా క్రికెటర్లు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడులు పెడుతుంటారు. వీటిలో పెట్టుబడి పెట్టే డబ్బులపై ఆదాయపు పన్ను చాలా తక్కువ.
- కొందరు భారత క్రికెటర్లు విదేశాలలో జరిగే లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంటారు. కొందరు అక్కడి యాడ్స్‌లో నటిస్తుంటారు. ఇలా వచ్చే విదేశీ ఆదాయాలను డబుల్ ట్యాక్సేషన్ అవైడన్స్ అగ్రిమెంట్(DTAA) కింద చూపిస్తారు. తద్వారా ఆ ఆదాయంపై ఒకేసారి పన్ను పడుతుంది.
- పలువురు భారత క్రికెటర్లు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ వ్యవహారాల కోసం సొంతంగా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్(ఎల్‌ఎల్‌పీ) కంపెనీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎల్ఎల్‌పీల ద్వారా ఆర్జించే వార్షిక ఆదాయంపై కేవలం కార్పొరేట్ పన్ను చెల్లిస్తారు. దీనివల్ల వారిపై వ్యక్తిగత ఆదాయపు పన్ను పడదు.
- కొందరు టీమిండియా ప్లేయర్లు హిందూ అవిభాజ్య కుటుంబాల (హెచ్‌యూఎఫ్) ఖాతాలు, ట్రస్టులను ఏర్పాటు చేసుకున్నారు. వాటికి తమ స్థిరాస్తులు, చరాస్తులను బదిలీ చేశారు. ఆ ఖాతాల్లోకి చేరే ఆదాయాలపై పన్నులు చాలా తక్కువ.
- పలువురు క్రికెటర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు నడుపుతున్నారు. కొందరికి స్పోర్ట్స్ అకాడమీలు ఉన్నాయి. ఇంకొందరు తమ సొంత ఉత్పత్తులను అమ్ముతున్నారు. దీనివల్ల వారు జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. పరోక్ష పన్నులు పడవు.