1990, 2000 దశాబ్దాల్లో ప్రతి ఇంటికి పరిచయమైన టాటా సుమో (Tata Sumo) మళ్లీ రీలాంచ్(Tata Sumo 2025 New Look)కు సిద్ధమవుతోంది. ఆఫ్-రోడ్ సామర్థ్యం, భద్రత, గట్టి నిర్మాణం కారణంగా అప్పట్లో ఈ SUV భారతీయ మార్కెట్లో అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ ఏడాది టాటా మోటార్స్ సుమోను ఆధునిక ఫీచర్లతో తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. మునుపటి మోడల్‌లో ఉన్న ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని అలాగే ఉంచుతూ, మరింత ఆధునిక టెక్నాలజీతో(Embracing modern design and technology) కొత్త సుమో వస్తుందని తెలుస్తోంది. క్రూయిజ్ కంట్రోల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లను అందించనున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వినియోగదారుల మన్ననలు పొందిన బాడీ ఫైటింగ్ తో పాటు ఎక్కువ స్పెస్ ఉండేలా ఈ మోడల్ రాబోతుంది.
Prime Minister Modi : ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత.. ఎస్‌పీజీ ఆధీనంలో ఆంధ్రా వర్సిటీ
కొత్త టాటా సుమోను రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ధరలో విడుదల చేయనున్నారు. మధ్యతరగతి కుటుంబాలు, ఆఫ్-రోడ్ వాహన ప్రియులను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నారు. టాటా మోటార్స్ ఈ మోడల్ ద్వారా తమ SUV విభాగంలో తిరిగి హవా చాటుకోవాలని చూస్తోంది. టాటా సుమో మొదటగా 1994లో భారతీయ మార్కెట్లోకి అడుగు పెట్టింది. మంచి ఫైటింగ్, సులభ నిర్వహణ, మరియు సామూహిక ప్రయాణాలకు అనువుగా ఉండటంతో దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదరణ పొందింది. ఆ సమయంలో సుమో ఆఫ్-రోడింగ్ వాహనంగా ప్రసిద్ధి చెందింది. మరి ఇప్పుడు గత గుర్తింపు , ప్రాచుర్యాన్ని పొందుతుందో లేదో చూడాలి.
