Platform Fee: మీరు తరచుగా బయట నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసేవారైతే ఇప్పుడు మీరు కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తన ప్లాట్‌ఫారమ్ ఫీజును ప్రతి ఆర్డర్‌పై రూ. 17.58 కి పెంచింది. గతంలో ఇది రూ. 14.99 గా ఉండేది. అంటే దాదాపు 17 శాతానికి పైగా పెరుగుదల కనిపించింది.
దీనికంటే ముందు జొమాటో కూడా తన ఫీజును సుమారు రూ. 2.40 పెంచిన సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రధాన ఫుడ్ డెలివరీ కంపెనీల నిర్ణయంతో ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం మునుపటి కంటే ఖరీదైనదిగా మారనుంది.
పెరుగుతున్న వ్యయాలతో కంపెనీలకు సవాళ్లు
ప్లాట్‌ఫారమ్ ఫీజు పెంపునకు గల కారణాలను స్విగ్గీ తన యూజర్లకు వివరించింది. కార్యకలాపాల నిర్వహణ, మెయింటెనెన్స్‌కు సంబంధించి పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. వాస్తవానికి ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ప్రభావం ఎల్‌పీజీ, ముడి చమురు ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన ధరలు పెరగడం వల్ల రెస్టారెంట్ల నుండి డెలివరీ భాగస్వాముల వరకు మొత్తం ఫుడ్ డెలివరీ వ్యవస్థపై వ్యయ భారం పెరిగింది. ఈ కారణాల వల్లే ప్లాట్‌ఫారమ్ ఛార్జీలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది.
Also Read: కామదా ఏకాదశి.. ఇలా చేస్తే కోరికలు నేరవేరతాయి!
తరచుగా ఆర్డర్ చేసేవారిపై పెరగనున్న భారం
స్విగ్గీ, జొమాటో పెంచిన ఈ ఫీజు ప్రభావం రోజువారీ లేదా తరచుగా ఆర్డర్ చేసేవారిపై ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఇంటికి దూరంగా ఉండి ఉద్యోగాలు చేస్తున్న యువత నెలవారీ బడ్జెట్‌పై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది. చిన్న మొత్తంలో జరిగిన ఈ పెంపు, నెలాఖరుకు చూసుకుంటే గణనీయమైన ఖర్చుగా మారుతుంది.
జొమాటో, స్విగ్గీ – ఇద్దరూ పెంచారు
జొమాటో: గత వారమే తన ప్లాట్‌ఫారమ్ ఫీజును సుమారు 19 శాతం పెంచింది. 2023 ఆగస్టులో కేవలం రూ. 2 తో ప్రారంభమైన ఈ ఫీజు, ఇప్పుడు రూ. 17.58 కి చేరుకుంది.
స్విగ్గీ: ఈసారి సుమారు 17 శాతం మేర ఫీజును పెంచింది. దీనివల్ల కస్టమర్లకు ప్రతి ఆర్డర్ మునుపటి కంటే భారం కానుంది.
