Site icon HashtagU Telugu

Anil Ambani : అనిల్ అంబానీకి సుప్రీం కోర్ట్ భారీ షాక్ ..

Anilambani

Anilambani

అనిల్ అంబానీ (Anil Ambani)కి సుప్రీం కోర్ట్ (Supreme Court) భారీ షాక్ ఇచ్చింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌కు (డీఏఎమ్ఈపీఎల్).. ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్‌సీ) రూ.8 వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారించిన ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం ఆగస్టు 2008లో DMRC – అనిల్ అంబానీ యాజమాన్యంలోని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (DAMEPL) మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

We’re now on WhatsApp. Click to Join.

నాలుగేళ్ల తర్వాత ఈ ఒప్పందం రద్దయింది. దీనిని ప్రశ్నిస్తూ డీఎంఆర్సీ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు (DMRC vs Reliance Infra) వడ్డీతో కలిపి రూ. 3,000 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. దీనిని ప్రశ్నిస్తూ డిఎంఆర్‌సి త్రిసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. తాజాగా సుప్రీం ధర్మాసనం DMRCకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అనిల్ అంబానీకి చెందిన కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు ఇంట్రాడేలో అత్యధికంగా 20% క్షీణించి రూ.227.40కి చేరాయి. దీనికి ముందు మంగళవారం కంపెనీ షేర్లు రూ.284.20 వద్ద ముగిశాయి. ఇదే క్రమంలో రిలయన్స్ పవర్ షేర్లలో 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకి రూ.28.34 రేటుకు పడిపోయాయి.

Read Also : Mumps Infection: మ‌రో వైర‌స్ ముప్పు.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్న నిపుణులు..!