Sundar Pichai : టాప్ టెక్ జాబ్స్ కోసం ‘త్రీ ఇడియట్స్’ ఫార్ములా : సుందర్ పిచాయ్

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌.. ఒక లెజెండ్. సామాన్య కుటుంబం నుంచి దిగ్గజ కంపెనీ సీఈఓ స్థాయికి ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.

Published By: HashtagU Telugu Desk
Sundar Pichai

Sundar Pichai

Sundar Pichai : గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌.. ఒక లెజెండ్. సామాన్య కుటుంబం నుంచి దిగ్గజ కంపెనీ సీఈఓ స్థాయికి ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. అటువంటి గొప్పతనం కలిగిన సుందర్ ఉద్యోగార్థులకు ఒక విలువైన సలహాను ఇచ్చారు. అది అభ్యర్థుల్లో ఆందోళనను తగ్గించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేదిగా ఉందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇంతకీ అదేమిటో ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

ఇటీవల ఓ మీడియా సంస్థకు సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈసందర్భంగా టాప్‌ టెక్‌ సంస్థలైన ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌ ఇంటర్వ్యూల్లో నెగ్గేందుకు ఏం చేయాలనే దానిపై యూత్‌కు సలహా ఇవ్వాలని పిచాయ్‌ను  ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కోరాడు. దీనికి పిచాయ్ బదులిస్తూ.. ‘‘ఏదైనా విషయాన్ని బట్టీ పట్టడానికి బదులు.. లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. అలా చేస్తేనే విజయం వరిస్తుంది’’ అని చెప్పారు. ఏదైనా అంశం గురించి తెలుసుకోవడానికి.. అర్థం చేసుకోవడానికి మధ్యనున్న తేడాను వివరించేందుకు 3 ఇడియట్స్‌ సినిమాలోని ఒక సన్నివేశాన్ని పిచాయ్ ప్రస్తావించారు. ‘‘ఆ సీన్‌లో మోటార్‌ ఎలా పనిచేస్తుందో నిర్వచించమని ఓ విద్యార్థిని టీచర్ అడగ్గా.. కంఠస్థం చేసిన డెఫినేషన్‌ చెప్పకుండా సాధారణ పదాలతో యంత్రం అంటే ఏమిటో వివరిస్తాడు. విషయాన్ని గ్రహించడమంటే అదే’’ అని పిచాయ్ వివరించారు. సాంకేతికతను లోతుగా అర్థం చేసుకుంటే గొప్ప విజయాలు సొంతమవుతాయని చెప్పారు.

Also Read :Cabinet Meeting : ఇవాళ క్యాబినెట్ భేటీపై సస్పెన్స్.. ఈసీ నుంచి దొరకని పర్మిషన్

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీకు ఇష్టమైన వంటకం ఏది  అని పిచాయ్‌ను ప్రశ్నించగా.. ‘‘నాకు ప్రాంతాన్ని బట్టి అనేక వంటకాలు నచ్చుతాయి. బెంగళూరులో ఉన్నప్పుడు నేను దోశ బాగా తినేవాడిని. అది నాకు చాలా ఇష్టమైన ఫుడ్‌. ఢిల్లీలో ఉన్నప్పుడు చోలే బటూరె తినడానికి ఇష్టపడే వాణ్ని. ముంబైకి వెళ్లినప్పుడు పావ్‌ భాజీ తినేవాణ్ని’’ అని తెలిపారు.

Also Read :Indian Army : జాబ్ విత్ ఇంజినీరింగ్ డిగ్రీ.. ఇంటర్ పాసైన వారికి గొప్ప ఛాన్స్

  Last Updated: 18 May 2024, 04:29 PM IST