Sukesh Offer : ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ గత కొన్నేళ్లుగా ఢిల్లీలోని మండోలి జైలులోనే ఉన్నాడు. జైలు నుంచే ఆయన తన లేఖలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. నిత్యం చర్చల్లో నిలుస్తున్నారు. నిన్నమొన్నటి దాకా హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు వరుసపెట్టి లేఖలు రాసిన సుఖేశ్.. ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 సంపన్నుడు, ఎక్స్ (ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్‌కు సంచలన లేఖ రాశారు. అందులో మస్క్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
Also Read :AP MLC Polls: ఏపీ ఎమ్మెల్సీ పోల్స్.. ప్రధాన పోటీ ఈ అభ్యర్థుల మధ్యే
‘‘నేను ‘ఎక్స్’ (ట్విట్టర్) సంస్థలో రూ.17వేల కోట్లు (2 బిలియన్ డాలర్ల) పెట్టుబడి పెడతా. ఇప్పటికిప్పుడే 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి, మరొక బిలియన్ డాలర్లను వచ్చే ఏడాది ఇస్తా. మస్క్ నా మనిషి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో మస్క్ ముఖ్య పాత్ర పోషించారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) విభాగం వ్యవహారాలను మస్క్ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు’’ అని లేఖలో సుఖేశ్(Sukesh Offer) ప్రస్తావించారు.
Also Read :Gold Card : అమెరికా పౌరసత్వం కోసం గోల్డ్ కార్డ్.. రూ.43 కోట్లు చాలు !
సుఖేశ్ చంద్రశేఖర్ చేసిన నేరం ఏమిటి ?
- సుఖేశ్ చంద్రశేఖర్ 2020 జూన్ నుంచి మే 2021 వరకు మొబైల్ ఫోన్లు, వాయిస్ మాడ్యూలర్లను వినియోగించి, ర్యాన్‌బ్యాక్సీ కంపెనీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అదితిసింగ్‌కు ఫోన్లు చేశాడు. తనను తాను కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అనూప్‌కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు.
- శివీందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని అదితి సింగ్‌ను నమ్మించారు. ఆమె నుంచి రూ.200 కోట్లకుపైగా వసూలు చేశాడు.
- అయితే ఎంతకూ శివీందర్ సింగ్‌కు బెయిల్ రాలేదు. దీంతో అదితికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది.
- దీంతో సుఖేశ్, జాక్వెలిన్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. పోలీసులు విచారించగా, జాక్వెలిన్ తన ప్రియురాలు అని చెప్పాడు.
- కేంద్ర హోంశాఖలో ఓ ముఖ్య అధికారిగా పనిచేస్తున్నా అంటూ సుఖేశ్ తనను పరిచయం చేసుకున్నాడని జాక్వెలిన్ పోలీసులకు తెలిపారు.