Amazon Prime Day Sales : టూ వీలర్ రైడింగ్‌కి హెల్మెట్ తప్పనిసరి అని నిరూపితమైంది. రోడ్డుప్రమాదాలు ఎదురైతే, హెల్మెట్ ధరించినవారు బహుశా ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ట్రాఫిక్ పోలీసులు పదే పదే హెల్మెట్ వాడకం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ఉన్న మంచి నాణ్యత గల హెల్మెట్లు ఖరీదైనవిగా ఉండటంతో చాలామంది వాటిని కొనాలనే ఆలోచన నుంచే వెనక్కి తగ్గుతున్నారు.
అయితే అలాంటి వారికే ఇప్పుడు సువర్ణావకాశం వచ్చింది. ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ STUDDS Accessories Ltd. తమ ప్రీమియం హెల్మెట్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ డే సేల్ (జూలై 12–14), ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ (జూలై 12–17) లో అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా STUDDS బ్రాండ్‌కి చెందిన Thunder, Drifter, Rider, Chrome, Ninja వంటి పాపులర్ హెల్మెట్ మోడళ్లపై 15 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
STUDDS కంపెనీ వివిధ రకాల హెల్మెట్లను అందిస్తోంది వీటిలో:
ఫుల్-ఫేస్ హెల్మెట్లు: మొత్తం ముఖాన్ని కవర్ చేస్తూ అత్యధిక రక్షణను అందిస్తాయి.
ఫ్లిప్-అప్ హెల్మెట్లు: అవసరమైతే ఫేస్ భాగాన్ని పైకి ఎత్తే వీలుగా ఉంటాయి.
ఓపెన్-ఫేస్ హెల్మెట్లు: తల భాగాన్ని కవర్ చేస్తూ, ముఖాన్ని ఓపెన్‌గా ఉంచుతాయి.
ఈ హెల్మెట్లు ప్రత్యేకమైన EPS (Expanded Polystyrene) పదార్థంతో తయారు చేయబడ్డాయి. ఇది ప్రమాద సమయంలో తలపై దెబ్బల తీవ్రతను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. అంతేగాక, వీటిలో Hypoallergenic Liners ఉన్నాయి. ఇవి సౌకర్యవంతంగా ఉండే లైనింగ్‌లు, చర్మాన్ని గజగజలించే అలెర్జీలను నివారించేందుకు ఉపయోగపడతాయి.
లగ్జరీ హెల్మెట్లపై అద్భుతమైన ఛాన్స్:
ఇప్పటికే మార్కెట్లో STUDDS SMK లాంటి హై-ఎండ్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు 25% వరకు తగ్గింపు లభించడంతో, భద్రతతో పాటు స్టైల్‌కి ప్రాధాన్యం ఇచ్చే రైడర్లకు ఇది సరైన సమయం. మంచి హెల్మెట్ కొని తమ ప్రయాణాన్ని సురక్షితంగా మార్చుకోవాలనుకునేవారికి ఈ ఆఫర్లు ఒక విలువైన అవకాశంగా మారాయి.
మొత్తం మీద… ఈ వర్షాకాలంలో, సురక్షిత ప్రయాణం కోసం నాణ్యమైన హెల్మెట్ కొనాలని చూస్తున్నట్లయితే, STUDDS సంస్థ అందిస్తున్న ఈ తగ్గింపు ధరలు తప్పక పరిశీలించాలి. అమెజాన్ ప్రైమ్ డే, ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ లను వినియోగించుకుని నాణ్యమైన హెల్మెట్‌ను తక్కువ ధరకు పొందండి – అది మీ ప్రాణాలను కాపాడుతుంది!
MS Dhoni : వైరల్ అవుతోన్న ధోని మ్యూజికల్ షర్ట్ లుక్.. ధర వింటే షాక్ అవుతారు.!