String Metaverse :డిజిటల్ మరియు ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత ఆర్థిక మౌలిక సదుపాయాల రంగంలో అగ్రగామిగా ఎదుగుతున్న ‘స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్’ 2025-26 ఆర్థిక సంవత్సరానికి (FY26) గాను కళ్లు చెదిరే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా వెలువడిన ఈ నివేదిక ప్రకారం, కంపెనీ వార్షిక నిర్వహణాదాయం గత ఏడాదితో (రూ. 407.36 కోట్లు) పోలిస్తే ఈసారి ఏకంగా రూ. 1,069.11 కోట్లకు ఎగబాకింది. ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గేమింగ్ ఎకోసిస్టమ్స్, మరియు హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ వంటి కీలక విభాగాలలో సాధించిన అసాధారణ వృద్ధే ఈ ఘన విజయానికి ప్రధాన కారణం. కంపెనీ నిర్వహణ లాభం (EBDIT) వార్షిక ప్రాతిపదికన 190 శాతం వృద్ధితో రూ. 121.88 కోట్లకు చేరగా, పన్ను తర్వాతి నికర లాభం (PAT) రూ. 102.52 కోట్ల చారిత్రాత్మక మైలురాయిని దాటింది. ఫలితంగా వాటాదారుల ఆర్జన (EPS) కూడా 170 శాతం పెరిగి రూ. 0.89గా నమోదై సంస్థ పటిష్టమైన ఆర్థిక స్థితిని చాటిచెప్పింది.
అంతర్జాతీయ విస్తరణ మరియు క్వార్టర్-4 జోరుఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ (Q4) స్ట్రింగ్ మెటావర్స్ తన విజయ పరంపరను కొనసాగిస్తూ రూ. 359.40 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. ఈ త్రైమాసికంలోనే నికర లాభం రూ. 34.71 కోట్లుగా నమోదు కావడం విశేషం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లు వెబ్3 టోకనైజేషన్, డిజిటల్ అసెట్స్ మరియు ఆల్గారిథమిక్ ఫైనాన్స్ వైపు వేగంగా మళ్లుతున్న తరుణంలో, సంస్థ భారత్‌తో పాటు యూఏఈ, హాంగ్ కాంగ్, సింగపూర్, కెనడా వంటి గ్లోబల్ మార్కెట్లలో వ్యూహాత్మకంగా విస్తరిస్తోంది. ఈ చారిత్రాత్మక పరివర్తనపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గణేష్ మీనవల్లి హర్షం వ్యక్తం చేస్తూ, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా తమ సంస్థ ఎదుగుతోందని పేర్కొన్నారు. చట్టబద్ధమైన ఆడిటర్లు సైతం ఎలాంటి అభ్యంతరాలు లేని క్లీన్ ఆడిట్ నివేదికను అందించడం ద్వారా సంస్థ యొక్క పారదర్శకత, నమ్మకసిత్రం మరోసారి నిరూపితమయ్యాయి.
