Site icon HashtagU Telugu

Startup Registration : స్టార్టప్‌ను రిజిస్టర్ చేసుకోవాలా ? ఆన్‌లైన్‌లో చాలా ఈజీ ప్రాసెస్

Register Startup Easily Online

Startup Registration : మన దేశంలో గత పదేళ్లలో పెద్దసంఖ్యలో స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. ఇంకా చాలా ఇప్పుడు కూడా ఏర్పాటవుతున్నాయి. చాలామంది ఔత్సాహిక యువత స్టార్టప్స్ ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ కథనం. స్టార్టప్స్ ఏర్పాటు ప్రక్రియపై ప్రాథమిక అవగాహన రావాలంటే ఈ కథనం చదవాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

మొదటి స్టెప్

స్టార్టప్‌ను మొదలుపెట్టాలంటే.. అది ఏవిధమైన సంస్థగా ఏర్పడాలి ? అనేది తొలుత మీరు నిర్ణయించుకోవాలి.  అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా  ఉండాలా ? లిమిటెడ్ లయబులిటీ పార్ట్‌నర్‌షిప్‌ సంస్థ‌‌గా ఉండాలా ? పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్‌గా నమోదు కావాలా ? అనేది మీరే డిసైడ్ చేయాలి. వీటిలో ఏదో ఒకటి మీరు ఎంపిక చేసుకోవాలి. అనంతరం సంబంధిత అప్లికేషన్‌ను పూర్తిచేసి, దానికి అన్ని డాక్యుమెంట్లు జతపర్చి రిజిస్ట్రేషన్(Startup Registration) కోసం స్థానిక రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌‌కు సమర్పించాలి. కొన్ని  రకాల ఫీజులు ఉంటాయి అవి కూడా చెల్లించాలి.

Also Read :Bangladesh : బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు ఆపండి.. ఐక్యరాజ్యసమితి పిలుపు

రెండో స్టెప్

రెండో స్టెప్‌లో మీరు  స్టార్టప్ ఇండియా వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి. దానిలో రిజిస్టర్ బటన్​పై క్లిక్ చేసి పేరు, ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, పాస్​వర్డ్‌లను ఎంటర్ చేయాలి. అనంతరం మీ ఈ-మెయిల్​కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి..  యూజర్ టైప్, పేరు, స్టేజ్ ఆఫ్ స్టార్టప్ వంటి వివరాలను నింపాలి. చివరగా ఆ ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. దీంతో స్టార్టప్ ఇండియా వైబ్​సైట్​లో మీ ప్రొఫైల్ క్రియేషన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. తదుపరిగా ఇంక్యుబేటర్/మెంటార్​షిప్ ప్రోగ్రామ్​ల కోసం మీరు అప్లికేషన్‌ను సబ్మిట్ చేయొచ్చు. లెర్నింగ్ రిసోర్సెస్, ఫండింగ్ ఆప్షన్లు, ప్రభుత్వ పథకాల వంటి వాటి గురించి సమాచారాన్ని సేకరించవచ్చు.

మూడో స్టెప్

మూడో స్టెప్‌లో స్టార్టప్ వ్యవస్థాపకులు ‘స్టార్టప్ డిపార్ట్​మెంట్​ ఫర్​ ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్’​ (డీపీఐఐటీ) గుర్తింపును పొందాలి. ఇందుకోసం స్టార్టప్ ఇండియా వెబ్​సైట్​లోకి లాగిన్ అయి.. రికగ్నిషన్ ట్యాబ్ కింద ఉన్న ‘అప్లై ఫర్ డీపీఐఐటీ రికగ్నిషన్’ ఆప్షన్​పై క్లిక్ చేయాలి. దీంతో ‘నేషనల్ సింగిల్ విండో సిస్టమ్’ వెబ్​సైట్‌ ఓపెన్ అవుతుంది. అందులో కంపెనీలు, ఎల్ఎల్​పీలు రిజిస్టర్ చేసుకోవాలి. స్టార్టప్‌లు డీపీఐఐటీ గుర్తింపు పొందడానికి ‘రిజిస్ట్రేషన్ యాజ్ ఏ స్టార్టప్’ ఫామ్​ను నింపాలి. అనంతరం స్టార్టప్ రికగ్నిషన్ అప్లికేషన్‌ను నింపాలి. ఈ రిజిస్ట్రేషన్ వల్ల స్టార్టప్‌కు  మేథో సంపత్తి సేవలు, వనరులు లభిస్తాయి. కంపెనీ వైండింగ్​కు, ఫండ్ ఆఫ్ ఫండ్స్​కు యాక్సెస్ లభిస్తుంది. పన్ను మినహాయింపులు లభిస్తాయి.

నాలుగో స్టెప్ 

స్టార్టప్ రికగ్నిషన్ ఫామ్​లో స్టార్టప్ అడ్రస్, సంస్థ ప్రతినిధి వివరాలు, డైరెక్టర్లు లేదా పార్ట్‌నర్ల సమాచారం, వ్యాపార కార్యక్రమాల​ వివరాలు ఉండాలి. సెల్ఫ్ సర్టిఫికేషన్‌ను అందించాలి. ఫామ్ కుడి వైపున ఉండే ప్లస్ గుర్తుపై క్లిక్ చేసి అందులోని అన్ని సెక్షన్లను ఎంటర్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్​ను అంగీకరించి సబ్మిట్ బటన్​పై క్లిక్ చేయాలి.

ఐదో స్టెప్ 

స్టార్టప్​ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫండింగ్ ప్రూఫ్​, పేటెంట్, ట్రేడ్​మార్క్ వివరాలు, అవార్డుల జాబితా, గుర్తింపు సర్టిఫికెట్లు, పాన్ నంబర్ వంటివి స్టార్టప్ ఇండియా వెబ్​సైట్‌లో సమర్పించాలి.  మీ స్టార్టప్​నకు సంబంధించిన పిచ్​డెక్​, వీడియో, వెబ్​సైట్​ లింక్​లను సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక  స్టార్టప్‌కు ఒక గుర్తింపు సంఖ్య మంజూరవుతుంది. అప్లై చేసిన 2 రోజుల్లోగా అన్ని డాక్యుమెంట్ల పరిశీలన పూర్తవుతుంది. ఆ వెంటనే రికగ్నిషన్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. స్టార్టప్ ఏదైనా ఆవిష్కరణ చేస్తే దానికి పేటెంట్ కావాలని భావిస్తే ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఫెసిలిటేటర్ల జాబితాలోని వారిని కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఇందుకోసం ఫీజులు కట్టాల్సి ఉంటుంది.

Also Read :Russia Vs Ukraine : రష్యా వర్సెస్ ఉక్రెయిన్.. కస్క్‌లో రష్యా ఎమర్జెన్సీ.. సుద్జాలో భీకర పోరు