కొత్త ఏడాదికి వాట్సప్‌ యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు

నూతన సంవత్సర వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో మరింత ఆనందంగా జరుపుకునేలా ఈ మార్పులు ఉపయోగపడతాయని వాట్సప్‌ తన తాజా బ్లాగ్‌ పోస్టులో వెల్లడించింది.

Published By: HashtagU Telugu Desk
Special features for WhatsApp users for the new year

Special features for WhatsApp users for the new year

. నూతన సంవత్సరానికి ప్రత్యేక ఫీచర్లు

. వాట్సప్‌ వినియోగంలో రికార్డు స్థాయి సంఖ్యలు

. యూజర్‌ అనుభవమే లక్ష్యం

WhatsApp features : కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. నూతన సంవత్సర వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో మరింత ఆనందంగా జరుపుకునేలా ఈ మార్పులు ఉపయోగపడతాయని వాట్సప్‌ తన తాజా బ్లాగ్‌ పోస్టులో వెల్లడించింది. ప్రతీ ఏడాది న్యూఇయర్‌ రోజున ప్లాట్‌ఫామ్‌పై భారీ స్థాయిలో ట్రాఫిక్‌ నమోదవుతుండటంతో, యూజర్‌ అనుభవాన్ని మెరుగుపర్చే దిశగా ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.

ఈసారి కొత్త ఏడాదిని ప్రత్యేకంగా గుర్తు చేసేలా ‘2026’ థీమ్‌తో కూడిన స్టిక్కర్‌ ప్యాక్‌ను వాట్సప్‌ విడుదల చేసింది. వీటితో పాటు వీడియో కాల్స్‌లో ఉపయోగించుకునే కొత్త ఎఫెక్ట్స్‌, ఫిల్టర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీడియో కాల్‌లో ఉన్నప్పుడే సరదాగా సెలబ్రేట్‌ చేసుకునేలా ఈ ఎఫెక్ట్స్‌ డిజైన్‌ చేశారు. ముఖ్యంగా గ్రూప్‌ వీడియో కాల్స్‌లో ఇవి మరింత ఆకర్షణీయంగా మారనున్నాయి. న్యూఇయర్‌ రోజు మొత్తం ఈ ఫీచర్లు యూజర్లకు అందుబాటులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.

సాధారణ రోజుల్లోనే తమ వేదిక ద్వారా రోజుకు సుమారు 100 బిలియన్‌ సందేశాలు, దాదాపు 2 బిలియన్‌ కాల్స్‌ జరుగుతున్నాయని వాట్సప్‌ గణాంకాలు చెబుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల సమయంలో ఈ సంఖ్యలు మరింత పెరుగుతాయని సంస్థ అంచనా వేస్తోంది. ప్రతి ఏడాది న్యూఇయర్‌ రోజున సందేశాలు, కాల్స్‌ విషయంలో కొత్త రికార్డులు నమోదవుతుండగా, ఈసారి కూడా అదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ వినియోగం ఉండొచ్చని భావిస్తోంది.

పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను అప్‌డేట్‌ చేయడమే తమ లక్ష్యమని వాట్సప్‌ పేర్కొంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో మరింత సన్నిహితంగా ఉండేలా ఈ మార్పులు ఉపయోగపడతాయని తెలిపింది. రాబోయే రోజుల్లో కూడా వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేలా కొత్త అప్‌డేట్స్‌ను తీసుకురానున్నట్లు సంకేతాలు ఇచ్చింది. 2026కి స్వాగతం చెప్పే వేళ వాట్సప్‌ అందించిన ఈ కొత్త ఫీచర్లు న్యూఇయర్‌ సెలబ్రేషన్లకు మరింత ఉత్సాహాన్ని జోడించనున్నాయి.

కొత్త ఫీచర్లు ఇవే..

. కొత్త ఏడాది సందర్భంగా వాట్సప్‌లో 2026 స్టిక్కర్‌ ప్యాక్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మీ బంధువులు, స్నేహితులకు న్యూఇయర్‌ గ్రీటింగ్స్‌ చెప్పేందుకు ఈ స్టిక్కర్లు ఉపయోగపడతాయి. వీటిని వ్యక్తిగత, గ్రూప్‌ చాట్‌లలో వినియోగించొచ్చు.
. వీడియో కాల్‌లో కొత్త ఎఫెక్ట్‌లను వాట్సప్‌ తీసుకొస్తోంది. కొత్త ఏడాదిలో వీడియో కాల్‌ సమయంలో ఆన్‌ స్క్రీన్‌పై ఫైర్‌వర్క్స్‌, కన్ఫెట్టి (రంగుల కాగితం ముక్కలు), స్టార్స్‌ వంటి ఎఫెక్ట్స్‌ను జోడించొచ్చు.
. ఏదైనా సందేశానికి కన్ఫెట్టి ఎమోజీ జోడించినప్పుడు ఒక ప్రత్యేక యానిమేషన్‌ దర్శనమిస్తుంది.
. స్టేటస్‌ విభాగంలోనూ తొలిసారి యానిమేటెడ్‌ స్టిక్కర్లను జోడిస్తున్నట్లు వాట్సప్‌ తెలిపింది. కాంటాక్టులో ఉన్న వ్యక్తులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేలా ఈ స్టిక్కర్లను వినియోగించొచ్చని పేర్కొంది.
. నూతన సంవత్సరం వేడుకల వేళ ఈవెంట్లను మరింత పకడ్బందీగా ప్లాన్‌ చేసుకోవడానికి ఈవెంట్‌ ప్లాన్‌, పోల్స్‌, లైవ్‌ లొకేషన్‌, వాయిస్‌/ వీడియో నోట్స్‌ను ఉపయోగించుకోవాలని యూజర్లకు సూచించింది.

  Last Updated: 30 Dec 2025, 08:46 PM IST