రతన్ టాటా (Ratan Tata) మరణ వార్త యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. గత కొద్దీ రోజులుగా ఆయన ఆరోగ్యం పై వార్తలు వస్తున్నప్పటికీ..ఆయన క్షేమంగా ఉంటారని భావించారు. కానీ నిన్న రాత్రి ఆయన విషమించడం తో కన్నుమూశారని తెలిసి అంత తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కేవలం బిజినెస్ రంగంవారే కాదు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు , సామాన్య ప్రజలు ఇలా ప్రతి ఒక్కరు రతన్ టాటా కు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
ఈ క్రమంలో ఆయన మాజీ ప్రేయసి సిమి గరేవాల్ (Simi Garewal) కూడా భావోద్వేగ వీడ్కోలు పలికారు. మీరు చనిపోయారని చాలా మంది అంటున్నారంటూ సిమి గరేవాల్ ట్వీట్ చేశారు. “మీ నష్టాన్ని భర్తీ చేయడం చాలా కష్టం.. వీడ్కోలు నా మిత్రమా.. # రతన్ టాటా” అని ట్వీట్ చేశారు. రతన్ ఎన్నో విజయాలు , ఎన్నో అవార్డ్స్, ఎంతో సేవ ఇలా ఎన్నో చేసినప్పటికీ.. ఆయన ఎందుకు వివాహం చేసుకోవలేదని చాలామందిలో కలిగే ప్రశ్న. అయితే రతన్ టాటా జీవితంలో నలుగురు మహిళలు వచ్చారని.. విషయం పెళ్లి దాకా వెళ్లి ఆగిపోయిందని పలు మీడియా లలో ప్రచారం అవుతున్నాయి. ఆ నలుగురిలో ఒకరే ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ సిమి గరేవాల్. రతన్ టాటా, సిమీ గరేవాల్ ప్రేమాయాణం చాలా సంవత్సరాలే సాగింది. ఇద్దరూ కొన్ని సంవత్సరాలపాటు డేటింగ్ చేశారు. అయినా చివరికి వారిద్దరికీ వివాహం జరగలేదు.
సిమీ గరేవాల్, రతన్ టాటాల (Ratan Tata-Simi Garewal ) పరిచయం చాలా ఆసక్తికరంగా జరిగింది. విదేశాల నుంచి చదువుకొని రతన్ టాటా ఇండియా తిరిగి వచ్చారు. అదే సమయంలో మంచి రొమాంటిక్ నేచర్ ఉన్న రతన్ టాటాకు సిమీ గరేవాల్ పరిచయమైంది. కొన్ని రోజులు ఇద్దరూ కలిసి మెలిసి తిరిగాక ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒక టీవి ఇంటర్‌వ్యూలో సిమీ గరేవాల్ కు రతన్ టాటాతో ఆమె ప్రేమ వ్యవహారం గురించి అడిగితే.. ఆమె తాను రతన్ టాటాను ప్రేమించిన విషయం నిజమేనని అంగీకరించారు. రతన్ జీ చాలా మంచి మనిషి అని, ఎప్పటికీ తన మనసులో ఆయన పట్ల అపార గౌరవం, ప్రేమ ఉంటుందని తెలిపింది. తమ పెళ్లికి జరగకపోవడానికి చాలా కారణాలున్నాయని చెప్పింది. కానీ ఆ కారణాలను ఆమె వెల్లడించలేదు.
Read Also : Mukesh Ambani Emotional: రతన్ నువ్వు మా గుండెల్లో ఉంటావ్.. ముఖేష్ అంబానీ ఎమోషనల్!