2025లో MNC ఉద్యోగులు (MNC Employees) తమ జీతాల పెరుగుదలపై నిరాశకు గురికావాల్సి వచ్చేఅవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా డెలాయిట్ ఇండియా తాజా నివేదిక చెబుతోంది. శాలరీ ఇంక్రిమెంట్లు (Salary Increments) గతేడాదితో పోలిస్తే తక్కువ శాతంలో ఉండవచ్చని నివేదికలో పేర్కొన్నారు.
AP Govt : క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు 4.50 లక్షల జీతం
గ్లోబల్ కేప్టివ్ సెంటర్స్ (GCC) గతంలో కంటే ఎక్కువ శాతం ఇంక్రిమెంట్ పెంచుతున్నా, ఇది గత సంవత్సరంతో పోలిస్తే తగ్గిన శాతం కావడం గమనార్హం. IT ప్రొడక్ట్ కంపెనీలు గతేడాది 10% శాలరీ ఇంక్రిమెంట్ అందించగా, ఈ ఏడాది 9% వరకు మాత్రమే పరిమితం కావొచ్చని సమాచారం. ఇది ఆ రంగంలో ఉద్యోగులకు నిరుత్సాహానికి కారణమవుతోంది. ఇతర సెక్టార్లతో పోలిస్తే IT సర్వీస్ రంగంలో ఇంకా ఎక్కువగా కోతలు ఉండనున్నాయి. ఆర్థిక అనిశ్చితి కారణంగా ఖర్చులను తగ్గించడానికి కంపెనీలు కొత్త నియామకాలను తగ్గించడమే కాకుండా, జీతాల పెరుగుదలలోనూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. దీనివల్ల ఉద్యోగులపై మానసిక ఒత్తిడి పెరగవచ్చు.
ఈ పరిణామాలు IT రంగంలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముతున్నాయి. శాలరీ ఇంక్రిమెంట్ల తగ్గుదలతో పాటు, కంపెనీలు ప్రోత్సాహక చర్యలను కూడా తగ్గించే అవకాశం ఉంది. ఇది ఉద్యోగుల విశ్వాసాన్ని తగ్గించవచ్చు. ఓవరాల్ గా 2025లో MNCల పరిస్థితేంటి అనేది ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భారతీయ IT, GCC రంగాలు తమ ప్రాధాన్యతను కొనసాగించడమే కాకుండా, ఉద్యోగులకు మద్దతు అందించడానికి కృషి చేయడం అత్యవసరం. సంక్షోభాలను ఎదుర్కొని, భవిష్యత్తులో పటిష్టతను సాధించడమే ప్రధాన లక్ష్యంగా తీసుకోవాలి.
